సినీ పరిశ్రమలో కొన్ని కొన్ని కాంబినేషన్లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. కాంబినేషన్ తోనే సినిమాకు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవుతుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో సీనియర్ అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ స్టైలే వేరు. ఏ సినిమా చేసినా ఆయన డిఫరెంట్ కాంబినేసన్లతో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తారు. ఫలితమెలా ఉన్నా బాలయ్య సినిమా అంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంటుంది. అటువంటి బాలయ్యతో క్రేజీ ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్ టీమ్ అప్ అయితే సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.

 

 

అటువంటి కాంబినేషనే ఇప్పుడు బాలయ్యకు సెట్ అయిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తో తప్ప అందరి హీరోలతో ఆయన సినిమాలు తీశాడు. ఇప్పుడు వీరిలో బాలయ్యతో ఆయన సినిమా ఒకే అయినట్టు సినీ వర్గాల సమాచారం. గతంలోనే వీరి కాంబోపై వార్తలు వచ్చాయి. అయితే బాలయ్యతో చేసే సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ నా లేక దిల్ రాజు మార్క్ మూవీనా అనేది తేలాల్సి ఉంది.

 

 

చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేయాలని దిల్ రాజు గతంలోనే ప్రకటించాడు. చిరంజీవితో సినిమా అయితే దిల్ రాజుకు కన్ఫర్మ్ కావొచ్చు కానీ పవన్ తో మాత్రం పింక్ రీమేక్ ఉంటుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. పవన్ తో సినిమా చేయాలనేది తన లైఫ్ టైమ్ డ్రీమ్ అని దిల్ రాజు గతంలోనే చెప్పాడు. కానీ పవన్ తో పింక్ రీమేక్ ఉంటుందో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ గ్యాప్ లో బాలయ్యతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: