ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్, పటాస్, ఢీ జోడి కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  అయితే కొంత కాలంగా ఈ షోల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.  పాపులారిటీ సంపాదించిన ఇలాంటి షోల్లో కొత్త యాంకర్లు రావడం ఒకింత ఆడియన్స్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.  ఇక తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో అందరి మనసు దోచిన ప్రదీప్ ఢీ జోడి తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  అయితే కొన్ని రోజులుగా ప్రదీప్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి.  తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాదు ఢీ షో లో ప్రదీప్ రీ ఎంట్రీ కూాాడా ఇచ్చాడు. 

 

అయితే ఫ్రష్ డీ షో లో యాంకర్ రవి వ్యాఖ్యాతగా వచ్చిన విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమం నుంచి రవి ఔట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో యాంకర్ రవి డీ షో లో రీ ఎంట్రీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రతీ ఒక్కరూ గాంగ్ స్టరే, కానీ నిజమైన గ్యాంగ్ స్టర్ అంటూ పరోక్షంగా యాంంకర్ రవిపై సటైర్లు వేసినట్లు సమాచారం. అయితే యాంకర్ రవి వెళ్లిపోవడానికి సుడిగాలి సుధీర్ కూడా కారణమే అనే టాక్ వినిపిస్తోంది.   

 

పటాస్ తో బాగా పాపులర్ అయిన రవి ఇక ఢీ షోలో దుమ్ము రేపాలని  చూశాడు.  కానీ ఆయన ప్లాన్ అంతా తలకిందులైనట్లే కనిపిస్తుంది.  యాంకర్ రవి ఢీ షో లోకి రాగానే జబర్ధస్త్ సుడిగాలిపై పిచ్చి పిచ్చి పంచ్ లు వేశాడు.  తన వ్యంగ్యమైన మాటలతో రోత పుట్టించేలా పంచ్ లు వేయడంతో ఆడియన్స్ కి చిర్రెత్తుకొచ్చింది.  దాంతో  సుడిగాలి సుధీర్‌తో రవి అనవసరంగా కామెంట్స్ చేశాడని, అవసరానికి మించి పంచులు వేస్తున్నాడని టాక్.  ప్రస్తుతం జబర్ధస్త్, ఢీ జోడితో బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు.  అంతే కాదు ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.  ఈ కారణాల వల్ల రవి ఢీ షో నుంచి ఔట్ అయినట్లు చర్చలు నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: