డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో సంక్రాంతి రేస్ సినిమాల ప్రమోషన్   మరింత వేగం పుంజుకోబోతోంది. రేపటి నుంచి టాప్ హీరోల అభిమానులకు కరువు తీరే పండుగ ప్రారంభం కాబోతోంది. రేపు సోమవారం కావడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి సోమవారం టీజర్ విడుదల కాబోతోంది. 

అదేవిధంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన టీజర్ కూడ రేపు విడుదల అవుతుంది అంటున్నారు. ఒకవేళ అది రేపు విడుదల కాకపోతే ఆ మరుసటి రోజు అయినా బన్ని అభిమానులకు ట్రీట్ ఉంటుంది అంటున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా సాయి తేజ్ నటించిన ‘ప్రతి రోజు పండగే’ టీజర్ ను డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లకు స్పందన బాగా రావడంతో ఈ టీజర్ తో తన మూవీ మ్యానియా మరింత పెరుగుతుందని తేజ్ ఆశిస్తున్నాడు. ఇక ఇదే వారంలో రవితేజ ‘డిస్కో రాజా’ టీజర్ కూడ రాబోతోంది. ఈ టీజర్  డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో వస్తుంది అని అంటున్నారు.

దీనితో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న డిసెంబర్ మొదటి వారం అంతా టాప్ హీరోల టీజర్ల వార్ తో వాటికి వచ్చే హిట్స్ పోటీతో హోరెత్తబోతోంది. గతంలో టాప్ హీరోల సినిమాల మధ్య కలక్షన్స్ ఫిగర్స్ విషయంలో మాత్రమే పోటీ ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయి టీజర్ల వార్ కూడ ముదిరి పోవడంతో టాప్ హీరోల అభిమానులు అంతా సోషల్ మీడియాలో రేపటి నుంచి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈనెల క్రిస్మస్ సినిమాల హడావిడితో పాటు వచ్చేనెల సంక్రాంతి సినిమాల హంగామా కూడ ఇదే నెల ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ టీజర్స్ ట్రైలర్స్ హడావిడి మధ్య డిసెంబర్ నెల అంతా ఇండస్ట్రీ మీడియా కళకళలాడుతూ ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: