యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో 105వ సినిమాగా తెర‌కెక్కుతోన్న రూల‌ర్ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యింది. ఈ యేడాది బాల‌య్య న‌టించిన రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలు రెండు ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు, ఎన్టీఆర్ క‌థానాయ‌కు డు రెండు సినిమాలు ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నూ బాల‌య్య అభిమానులు మెచ్చే అంశాలు, ఫైట్లు, యాక్ష‌న్ సీన్లు కూడా లేవు. దీంతో ఇప్పుడు రూల‌ర్ సినిమాతో బాల‌య్య అభిమానుల‌కు ఆ లోటు తీరిపోనుంద ని అంటున్నారు.

 

కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. డిసెంబ‌ర్ 20న రూల‌ర్ థియేట‌ర్లలోకి దిగ‌నుంది. ఇక రూల‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో క్లోజ్ చేశారు. ఆంధ్రాలో మంచి రేట్లే ప‌లికాయంటున్నారు. బాలయ్య కు వున్న మాస్ పుల్లింగ్ పవర్ కారణంగా సీడెడ్‌లో కూడా మంచి రేటే వ‌చ్చింద‌ట‌.

 

రూల‌ర్ ఆంధ్రా రైట్స్ రు. 10 కోట్ల రేషియోలో అమ్ముతున్నారు. బాలయ్య సినిమా ఈ రేంజ్ బిజినెస్ అంటే కాస్త ఆశ్చర్యమే. అయినా వాస్తవమే. వైజాగ్‌, ఈస్ట్‌, వెస్ట్‌, కృష్నా, గుంటూరు జిల్లాల్లో బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్లు ఈ సినిమాను కొన్నారు. ఇక సీడెడ్లో బాల‌య్య క్రేజ్ నేప‌థ్యంలో అక్క‌డ ఎక్కువ రేట్లు ప‌లికిన‌ట్టు టాక్‌. ఇక నైజాంలో ఓన్ రిలీజ్ అంటున్నారు.

 

ఓవ‌ర్సీస్‌లో ఈ రొటీన్ మాస్ మ‌సాలా సినిమాకు పెద్ద రేట్లు ప‌లికే ఛాన్స్ లేదు. అక్క‌డ వ‌ర‌కు ప్రీ గానే ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. బాల‌య్య రూల‌ర్‌లో పోలీస్ గా అటు మాఫియా డాన్ గా రెండు షేడ్స్ లో బాలయ్య కనిపిస్తాడు. సినిమా అంతా ఫైట్లు..పాటలు మధ్య కథ నడిచే విధంగా డిజైన్ చేసినట్లు బోగట్టా. ఇక ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న సోనాల్ చౌహాన్‌,  వేదిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక అదే రోజు స‌ల్మాన్ ద‌బాంగ్ 3, సాయిధ‌ర‌మ్ ప్ర‌తి రోజు పండ‌గే కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: