హైదరాబాద్ లో మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి ఉదంతం తర్వాత మహిళలకి రక్షణ లేదు అని స్పష్టం అయింది. ఈ క్రమంలోనే ముంబైలో  స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కు ఒక చేదు అనుభవం జరిగింది . ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.? నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లో వేసిన తొలి అడుగే సూపర్ హిట్ అయింది. తన తొలి సినిమా ‘కేదార్‌నాథ్'తో బెస్ట్ డెబ్యూ అవార్డు కూడా అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ముద్దుగుమ్మ తెలుగు సూపర్ హిట్ సినిమా  ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి అందరిని మెప్పించింది.

 

ఇంతలో ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం వివాదాలు అవుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఆమె ప్రేమే కారణం కార్తీక్ ఆర్యన్ అనే హీరోతో ఈమె డేటింగ్‌ చేయడమే. సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ మధ్య ప్రేమ చిగురించింది అని అందరు కూడా అనుకుంటున్నారు. వీళ్లిద్దరూ కలిసి షూటింగ్ కోసం వెళ్లినప్పుడు, బయట కూడా కలిసి తిరుగుతున్నారు. అలాగే, ఎయిర్‌పోర్టులో సైతం చాల సార్లు మీడియాకి దొరికిపోయారు.

 

Image


ఇప్పుడు విషయం ఏమిటి అంటే సారా అలీ ఖాన్‌కు ముంబై ఎయిర్‌పోర్టులో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎయిర్‌పోర్టులో లోపలికి వెళ్తున్న సమయంలో కొందరు  సెల్ఫీలు అడిగారు. ఆమె కూడా అందరికి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అదే విధంగా ఆ సమయంలో ఓ ఆకతాయి వచ్చి ఫొటో అడగ్గానే ఓకే చెప్పింది. అయితే, అతడు ఫొటో తీసే క్రమంలో ఆమెపై చేయి వేశాడు.

 

సెల్ఫీ కోసం వచ్చి మీద చేయి వేసినా కూడా సారా అలీ ఖాన్ నవ్వుతూ అతనికి తగ్గిన బుద్ధి చెప్పింది. తనతో ఆలా ప్రవర్తించినప్పటికీ అతడిని సారా  ఏమీ అనలేదు అంతటితో ఆగకుండా రెండు సార్లు సెల్ఫీకి ఫోజులిచ్చింది. దీంతో సందర్భం నుంచి ఎంతో నేర్పుతో బయట పడిన సారా మీద సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో సదరు యువకుడిని నెటిజన్లు బూతులు తిడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: