నందమూరి బాలకృష్ణసినిమా చేసిన అది మాస్ కోణంలో వస్తుందన్న విషయం తెలిసిందే.. మాస్ ప్రేక్షకులకు ఆయన సినిమా నచ్చుతుండంతో ఆయన సినిమాలకు మంచి ఆదరణ పొందుతున్నాయి. అందుకే బాలయ్య వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఈయన సినిమాలకు మాఆర్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉండటం గమనార్హం. 

 

గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఏ సినిమా కూడా బాలయ్య కు అనుకున్న ఫలితాలను అందించలేక పోయాయి. దానితో కొంత కాలం గ్యాప్ తీసుకున్న బాలయ్యసినిమా తరువాత నటించే సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.  ఆ సినిమానే రూలర్. ఈ స్పీమాలో బాలయ్య కొత్త లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

 

అయితే,  కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముంచుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ లుక్స్ , టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్ర కోసం పోలీస్ గెటప్ లో మరో పాత్రకోసం సూటు బూటు వేసుకొని క్లాస్ లుక్ లో  కనిపించనున్నారు.

 

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. "అడుగడుగో యాక్షన్ హీరో" అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ సాంగ్ సాగింది. ఈ పాట శ్రోతలను ముఖ్యంగా బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పాటు తో సినిమా పై అంచనాలు పెరిగాయని చెప్పాలి. సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కొద్దీ రోజుల్లో సినిమా విడుదల కానుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: