‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ కు ఇంటి తలుపు తడుతున్న అదృష్టం స్థాయి రోజు రోజుకు పెరిగి పోతోంది. ‘బిగ్ బాస్ 3’ షో తరువాత రాహుల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో అతడిని అనేక వ్యాపార సంస్థల ప్రారంభోత్సవానికి పిలవడం అలా తమ షోరూమ్స్ ప్రారంభానికి వచ్చిన రాహుల్ కు భారీ పారితోషికాలు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

అంతేకాదు అన్నట్లుగా చిన్న చిన్న బ్రాండ్స్ ను ఎండార్స్ చేయడానికి ఆఫర్స్ రావడమే కాకుండా రాహుల్ తో పాటు పునర్నవిని కలిపి ఇలాంటి బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కు జంట ఆఫర్లు ఇవ్వడం హాట్ న్యూస్ గా మారింది. దీనికితోడు రాహుల్ ‘అల వైకుంఠపురములో’ ‘ప్రతిరోజు పండగే’ మూవీల కోసం పాడిన పాటలు హిట్ అవ్వడంతో అన్ని చోట్ల రాహుల్ మ్యానియా కనిపిస్తోంది. 

వాస్తవానికి ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ కు ఆ షో తరువాత వచ్చిన క్రేజ్ తో పోల్చుకుంటే రాహుల్ కు ‘బిగ్ బాస్ 3’ షో ద్వారా వచ్చిన క్రేజ్ తక్కువ అనే చెప్పుకోవాలి. అయితే ‘బిగ్ బాస్ 3’ విన్నర్ అయిన తరువాత రాహుల్ కు వరస పెట్టి వస్తున్న అవకాశాలు చూస్తుంటే ఎవరికైనా అదృష్టం అంటూ మొదలైతే దానిని ఎవరు ఆపలేరు అన్న మాటలు రాహుల్ విషయంలో పూర్తిగా నిజం అవుతున్నాయి.


ఇలా రాహుల్ అదృష్టం పరుగులు పెడుతుంటే కృష్ణవంశీ తీయబోతున్న ‘రంగమార్తాండ’ మూవీలో కీలక పాత్రకు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. మరాఠీ మూవీ ‘నటసామ్రాట్’ మూవీకి రీ మెక్ గా తీస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. జాతీయ స్థాయి అవార్డును అందుకున్న ఈ మూవీ మరాఠీ భాషలో హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ తెలుగు రీమేక్ కూడ విజయం సాధిస్తే నటుడుగా రాహుల్ దశతిరిగి గాయకుడుగా నటుడుగా రాహుల్ అందని స్థాయిలో ఉంటాడు అనుకోవాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: