నంద‌మూరి హీరోలు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఈ ఇద్ద‌రు హీరోలు న‌టిస్తోన్న సినిమాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. బాల‌య్య న‌టించిన రూల‌ర్ సినిమా, క‌ళ్యాణ్ రామ్ ఎంత మంచివాడ‌వురా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. రూల‌ర్‌ను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎంత మంచివాడువురా ను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న రిలీజ్ చేయ‌నున్నారు.

 

ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల‌కు బిజినెస్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. బాల‌య్య రూల‌ర్ ప‌క్కా ఊర మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా అన్న‌ది అర్థ‌మైపోయింది. దీంతో ఈ సినిమాను అస‌లు ఓవ‌ర్సీస్‌లో కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. దీంతో నిర్మాత ఓవ‌ర్సీస్‌లో ఖ‌ర్చులు స్వ‌యంగా భ‌రిస్తూ మ‌రి రూల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నార‌ట‌.

 

ఇక ఈ సంక్రాంతి సినిమాలనగానే రెండే సినిమాలు గుర్తొస్తాయి. ఒకటి మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు, రెండోది బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో. కానీ ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న క‌ళ్యాణ్ రామ్‌ ఎంత మంచివాడవురా సినిమాకు ఏ మాత్రం బ‌జ్ లేదు. దీనికి త‌ప్పంతా క‌ళ్యాణ్ దే అంటున్నారు. అల వైకుంఠ‌పురంలో, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల ప్ర‌మోష‌న్లు స్టార్ట్ అయ్యి చాలా కాలం అయ్యింది.

 

ఇక పోటీ సినిమాల నుంచి స్టిల్స్‌, టీజ‌ర్లు, ప్రోమోలు వ‌స్తుంటే క‌ళ్యాణ్ రామ్ ఎంత మంచివాడ‌వురా సినిమాను గాలికి వ‌దిలేశారు. దీంతో బిజినెస్ విష‌యంలో కూడా అనుకున్న రేట్ల‌కు ఎంక్వైరీలు రావ‌డం లేద‌ట‌. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఇప్పుడు అలెర్ట్ అయిన క‌ళ్యాణ్ రామ్ ఈ నెల 6 నుంచి ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. సినిమా సంక్రాంతికి వస్తోందని తెలిసి కూడా ప్రచారాన్ని లైట్ తీసుకున్నాడు.  ఎప్పుడైతే జ‌నాలు సినిమాను ప‌ట్టించుకోవ‌డం మానేశారో వెంట‌నే క‌ళ్యాణ్ కాస్త స్పీడ్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: