ఎంతో ప్రతిష్టాత్మకంగా తండ్రి నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన రెండు బయోపిక్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడం అదేవిధంగా తర్వాత ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉండటం తో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలోనూ మరియు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్స్ గా వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్న నేపథ్యంలో అంతేకాకుండా బాలయ్య బాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న క్రమంలో కార్పోరేట్ బిజినెస్ తరహాలో 2 విభిన్నమైన పాత్రలో కనబడుతున్న తరుణంలో సినిమాపై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. డిసెంబర్ 20వ తారీఖున క్రిస్మస్ పండుగ సెలవుల నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్  ఉంది.

 

ఇటువంటి నేపథ్యంలో రిలీజ్ దగ్గరపడుతున్న క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది రూలర్ సినిమా యూనిట్. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటి సాంగ్ 'అడుగడుగో' అన్న తరహాలో వినబడే సాంగ్ ఇటీవల సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. మంచి మాస్ బీట్ తో బాలయ్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే విధంగా సాంగ్ ఉంది.

 

రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. చిరంతన్ భట్ రూలర్ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సాయిచరణ్ ఈ పాటకు గాత్రాన్ని అందించారు. కార్పొరేట్ లుక్ లో కనిపిస్తున్న బాలయ్యని వర్ణించేలా ఈ సాంగ్ మొత్తం సాగుతుంది. అయితే విడుదలైన సాంగ్ విన్న ప్రేక్షకులు మరియు బాలకృష్ణ అభిమానులు నో డౌట్ రూలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం గ్యారెంటీ అని కామెంట్ చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: