డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత కొన్ని సంవత్సరాల నుండి తెరకెక్కిస్తున్న సినిమాలు గమనిస్తే ఎక్కువగా తెలుగు రాష్ట్ర రాజకీయ నేతలకు సంబంధించిన సినిమాలనే టార్గెట్ గా పెట్టుకొని చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కావడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకూడదని అనేక ఇబ్బందుల పాలు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని తెరకెక్కించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలను టార్గెట్ చేసుకునే విధంగా సినిమాలో పాత్రలు చిత్రీకరించడంతో తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా పై అనేక విమర్శలు వివాదాలు వినబడుతున్నాయి.

 

సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు అదే విధంగా టీచర్ బట్టి చూస్తే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. మొత్తంమీద చూసుకుంటే సినిమాలో పాత్రలు గమనిస్తే ఎక్కువగా ఏపీలో ప్రముఖంగా చలామణి అవుతున్న రాజకీయ నేతలే టార్గెట్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినిమాకి సంబంధించిన టైటిల్ విషయంలో అలాగే ఇంకా అనేక వివాదాల విషయంలో సినిమా రిలీజ్ స్టే కోరుతూ కొందరు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో పిటిషన్ వేయగా...దానికోసం ఒక వారం లోగ వివరణ ఇవ్వాలని తీర్పు వచ్చింది. అయితే ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గిన రాంగోపాల్ వర్మ తన చిత్ర టైటిల్ ని మార్చేశారు కూడా.

 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ని కాస్త “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” అని మార్చేశారు. ఇకపోతే రాంగోపాల్ ఒక్కసారిగా తన మాట మార్చేసుకున్నాడు. తాను ఏదైనా కథను నమ్మితే, అన్ని కూడా డ్రమెటిక్ గా తీస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెబుతూనే, కమ్మ సామాజిక వర్గం అంటే ఇష్టమని అన్నారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమా పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: