‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తరువాత స్మాల్ బడ్జెట్ మూవీ గీత గోవిందం సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాడు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పడడంతో తన మార్కెట్ వ్యాప్తి చెందే విధంగా విజయ్ దేవరకొండ బాగా ప్లాన్ చేసి 'డియర్ కామ్రేడ్' అనే సినిమాని సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలలో వారి వారి భాషలలో విడుదల చేయడం జరిగింది. అయితే ఆ సినిమా విడుదలైన ప్రతి చోట దారుణంగా ఫ్లాప్ కావడంతో ఇదే క్రమంలో తాను నిర్మాతగా మారి నిర్మించిన సినిమా కూడా ఫ్లాప్ అవడంతో భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు విషయంలో పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతిమాధవ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే రొమాంటిక్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. నలుగురు హీరోయిన్లు నేపద్యంలో కలిగిన ఈ స్టోరీ లో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్ర తరహాలో ఉండే క్యారెక్టర్ లో నటించినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచన మొదట భావించగా తర్వాత రాబోయే ప్రేమికుల దినోత్సవం అనగా ఫిబ్రవరి 14 వ తారీకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వచ్చే సంవత్సరం విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా వరుస సినిమాలతో ఉన్నట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్.

 

'వరల్డ్ ఫేమస్ లవర్' పూర్తయిన వెంటనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో 'ఫైటర్' అనే సినిమా ఆ తర్వాత అలాగే ఆనంద్ అన్నామ‌లై డైరెక్ష‌న్‌లో `హీరో` అనే సినిమాలో మరియు అదే విధంగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో మరో సినిమాలో విజయ్ దేవరకొండ నటించడానికి రెడీ అయినట్లు దీంతో వచ్చే ఏడాది మొత్తం విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అంతే కాకుండా తాజాగా ఇటీవల ‘హుషారు’ సినిమా డైరెక్టర్  శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: