రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి అత్యాచార ఘటనపై చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు సెలబ్రిటీలు ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ ఎక్కువగా నిందితులను బహిరంగంగా శిక్షించాలని ఉరి వేయాలి మరియు అదే విధంగా కొంతమంది నడిరోడ్డుపై కాల్చి పారేయాలి అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు.

 

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్...చిరంజీవి ఇంకా చాలా మంది కొత్త హీరోలు ఈ ఘటనపై స్పందించ గా...తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రియాంక రెడ్డి హత్య పై స్పందించారు. ఇటువంటి దారుణమైన ఘటనకు పాల్పడిన నిందితులను పిచ్చి కుక్కలతో పోల్చారు. ఇలాంటి వారిని చంపాలని డిమాండ్ చేయడం సమయం ప్రజా చేయడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అటువంటి సలహాలు ఇచ్చే బదులు మహిళలకు ఎలా రక్షణ కల్పించాలనే అంశంపై కేటాయిస్తే మంచిదన్నారు.

 

వాళ్లకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. దానికి బదులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలని వర్మ పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని చంపేయాలి, తగలబెట్టాలి అనే సాధ్యం కాని డిమాండ్లను చేసే బదులు, వారిని ప్రశ్నించడాన్ని టీవిల్లో ప్రసారం చేసి సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్లలో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు.. ఎందుకు ఆలోచించారు..? అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను చెప్పుకొచ్చిన రాంగోపాల్ వర్మ ఇటువంటి ఘటనలు జరగకుండా శాస్త్రీయంగా పరిశోధన జరపాలని రాంగోపాల్ వర్మ సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: