ఒకప్పుడు సినిమాల్లో పాటలు వినాలంటే ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత రెండు రోజులకు కూడా క్యాసెట్లు వచ్చేవి కాదు. కాలం మారే కొద్దీ టెక్నాలజీ మారుతూ మార్కెటింగ్ స్ట్రాటజీ లో మార్పులు వచ్చి, ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు లేకుండా అని డైరెక్ట్ గా ఇంటర్నెట్లో సినిమా పాటలు అన్నీ విడుదల చేస్తున్నారు.ఇప్పుడు ఆడియో హిట్ అయింది అంటే అది కేవలం ఇంటర్నెట్లో వచ్చే వ్యూస్ సంఖ్యను బట్టి ఉంటుంది.

 

Image

 

పాట ఎంత బాగా హిట్ అయితే సినిమాకి అంత హైప్ వస్తుంది. అలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురం చిత్రంకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. అందులో రెండు పాటలు ఊహించిన దాని కంటే ఎంతో హిట్ అయ్యాయి మొదట విడుదలైన సామజవరగమనా పాట ఈ రోజుతో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ వస్తేనే చాలా గొప్పగా చూసే వాళ్ళం మనము.

 

కానీ ఇప్పుడు అల వైకుంఠపురం లోని సామజవరగమనా పాట ఏకంగా 10 కోట్ల మంది వీక్షించారు. గీత గోవిందం లో పాట పాడిన తర్వాత సిద్ శ్రీరామ్ కి ఇది మరో మలుపురాయి అని చెప్పాలి. ఈ మధ్యనే తమిళంలో వచ్చిన రౌడీ బేబీ పాట కూడా 70 కోట్ల మైలురాయిని అందుకున్న విషయం మనందరికీ తెలిసినదే. ఏది ఏమైనా ఇలా పాటలు ముందు రిలీజ్ చేసి తమ సినిమా మీద మంచి హైప్  తీసుకుని వస్తున్నారు నిర్మాతలు.

 

  ఇక ఇదే ఊపులో `అల వైకుంఠపురములో` తదుపరి ప్రమోషన్ కి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న ఓ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: