వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులపై రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. దేశంలో ఉన్న రాజకీయ నేతలు మరియు చాలామంది సెలబ్రిటీలు తాజాగా జరిగిన ఘటనపై న్యాయస్థానాలు మరియు ప్రభుత్వాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నడిరోడ్డు మీద వారిని ఉరి వేయాలని వేరే మగవాడికి ఇలాంటి ఆలోచన రాకుండా శిక్ష విధించాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ ఘటనపై చాలా మంది స్టార్ హీరోలు డైరెక్టర్లు స్పందించగా...తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ప్రియాంక అత్యాచారం ఘటనపై స్పందించారు.

 

అంతేకాకుండా జరిగిన అత్యాచారం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. విషయంలోకి వెళితే ఇటీవల ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సుకుమార్ ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటనపై స్పందించారు. సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి. ప్రియాంకని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎవరికైనా కన్నీరు ఆగవు. సంబంధంలేని వారు కూడా ప్రియాంక సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

 

ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తుంటే.. పిల్లలని ఎలా పెంచాలనే భయం వేస్తోంది. క్రిమినల్స్ అందరూ మనలో నుంచే వస్తారు. ఈ సంఘటనకు మనం కూడా ఓ రకంగా భాద్యులమే. మొబైల్, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్ ఎక్కువైపోయాయి. గతంలో సమాజం ఇంత దారుణంగా లేదు. ప్రియాంక కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రియాంక 100కి కాల్ చేసి ఉంటే బావుండేది అని అంటున్నారు. నేను కూడా దీని గురించి ఆలోచించా. ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించగా.. ప్రియాంక మాటలు వింటే చాలా సున్నితమైన అమ్మాయి అని తెలుస్తోంది.

 

దోషులు మొదట ఆమెకు సాయం చేస్తామని నమ్మించారు. ఒక వేళ నేను 100కి కాల్ చేస్తే.. వాళ్ళు నిజంగానే నాకు సాయం చేసే మనసుతో ఉన్నారేమో.. నీకు సాయం చేయడానికి వస్తే పోలీసులకు అప్పగించావేంటి అని అంటారేమో.. అని ఆ సమయంలో ప్రియాంక అనుకొని ఉంటుంది. అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాలం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. 100కి కాల్ చేయాలని అనిపిస్తే చేసేయండి.. తర్వాత సారీ చెప్పొచ్చు. సమాజంలో ఏ మగవాడిని నమ్మక పోవడమే బెటర్ అని డైరెక్టర్ సుకుమార్ తాజాగా వచ్చిన కార్యక్రమంలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: