ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు రాజకీయాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెల్లి  అక్కడ ప్రజా సేవ చేస్తూ  ఉంటారు... చాలా మంది రాజకీయ నాయకులు సినిమాల్లో నటిస్తూ రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్ళిన వారు విజయం సాధిస్తే ఇంకొంతమంది మాత్రం విజయం సాధించలేక మళ్లీ సినిమాల్లోనే కొనసాగారు . సినిమా ఇండస్ట్రీలో నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన మహామహులు ఎంతోమంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు చాలామంది ఆట సినిమాలో ఇటు రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ ఆలీ పృద్వి లాంటి కమీడియన్స్  కూడా రాజకీయాలు సినిమాల్లో రాణించాలని చూస్తున్నారు. 

 

 

 

అయితే  టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తన హావభావాలతోనే కడుపుబ్బ నవ్వించి హాస్యబ్రహ్మ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కూడా ప్రస్తుతం పాలిటిక్స్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను డిసెంబర్ 5వ తేదీన నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. దీంతో కర్ణాటక ఉప ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి . ఈ సందర్భంగా బిజెపి టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం రంగంలోకి దించింది.తాజాగా  టాలీవుడ్ స్టార్ కమెడియన్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. 

 

 

 

 ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు బ్రహ్మానందం.ఇక  బ్రహ్మానందాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో సందడి సందడి నెలకొంది. ప్రచారంలో భాగంగా మాట్లాడిన బ్రహ్మానందం బిజెపి అభ్యర్థి సుధాకర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుధాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని అందుకే తన ఎన్నికల ప్రచారానికి వచ్చాను అని బ్రహ్మానందం తెలిపారట. ఇక్కడ ప్రచారంలో కూడా పూర్తిగా తెలుగులోనే మాట్లాడారట  బ్రహ్మానందం. ఈ ప్రచారంలో కొన్ని సినిమా డైలాగులు కూడా చెప్పి అక్కడికి చేరుకున్న జనాల్లో ఉత్సాహంగా నింపారట . ఈ సంఘటనతో ఒక్కసారిగా బ్రహ్మ అభిమానుల్లో ఓ ప్రశ్న తలెత్తుతుంది. సినిమాలు తప్ప మరో ప్రపంచం లేకుండా ఉన్న తమ అభిమాన హాస్య నటుడు బ్రహ్మానందం... ఉన్నట్టుండి ప్రచారం నిర్వహించడం తో... త్వరలో రాజకీయాల్లోకి కూడా రాబోతున్నరా అంటూ భావిస్తున్నారు.. అయితే ఈమధ్య హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. చూడాలి మరి బ్రహ్మానందం భవిష్యత్తులో సినిమా లోనే కొనసాగుతారా రాజకీయాల్లోకి వస్తారా అనేది .

మరింత సమాచారం తెలుసుకోండి: