ఎక్కడ చూడు అమ్మాయిల పైన మృగాళ్ల కళ్లు కాకుల్లా వాలుతున్నాయి. కొందరు మంచివారు లేకపోవచ్చూ, కానీ నిండుకుండలో ఉన్న పాలల్లో చుక్క విషం వేసినా ఆపాలు విషంగా మారుతాయి అన్నట్లుగా మిగతా అమ్మాయిల మీద కూడా దీని ప్రభావం పడి ఇప్పుడు లోకంలో ఆడదంటే అనుభవించడానికే అన్నట్లుగా  చూస్తున్నారు.

 

 

ఇక సినిమా రంగంలో ఉన్న లైంగిక వేధింపుల సంగతి చెప్పక్కర్లేదు. ఇకపోతే ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటి రీస్ విదర్‌స్పూన్ చిన్న వయసులోనే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టడానికి కారణం తాను నటిస్తున్న వెబ్ సిరీసే కారణమని తెలిపారు. ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఓ డైరెక్టర్ నా 16 ఏళ్ల వయసులో నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విషయం తెలిసిన ఏజెంట్స్, ప్రొడ్యూసర్స్ నా నోరు నొక్కేశారు. అదొక్కటే కాదు నా కెరీర్‌లో చాలా సార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను ఈ విషయాలను బయటపెట్టనందుకు ఇప్పటికీ చింతిస్తున్నాను.

 

 

ఆ సమయంలో ఎందుకు చెప్పలేకపోయానంటే.. నోరు విప్పితే ఎక్కడ నాకు పనిలేకుండా పోతుందోనని. నాకు తెలిసివారికి చెబితే మౌనంగా ఉండమనేవారు. అప్పట్లో కల్చర్ అలాగే ఉండేది. కానీ నేను ఊరుకోలేదు. నా కుటుంబంతో కలిసి న్యాయం కోసం పోరాడాను. నాలాంటి ఎందరో నటీమణులు ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారని నాకు అప్పుడు తెలియ లేదు. కానీ మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎందరో ఆడవాళ్లు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టడం చూసి షాకయ్యాను.

 

 

ఇంత మంది బాధితులు ఉన్నారా అని అవాక్కయ్యాను. ఒక్కోసారి ఈ ప్రపంచం నాకు క్రేజీగా అనిపిస్తుంటుంది. టీవీ షోలు, సినిమాలే మన స్థాయేంటో తెలియజేస్తాయి’ అని తెలిపారు. ఇకపోతే మీటూ ఉద్యమం నేపథ్యంలో చాలా మంది నటీమణులు తమ అనుభవాలను పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: