అమెరికాలో తెలుగు సినిమా వసూళ్లు తగ్గాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. బాలయ్య హీరోగా నటిస్తున్న రూలర్ సినిమా అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ కి నిర్మాత నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు. కానీ, ఎవరు ధైర్యం చేసి ముందుకి రాలేదు విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ నిర్మాత టెన్షన్ పడుతున్నాడు. చివరికి కోటి రూపాయలకి అయినా ఇచ్చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. కానీ ఆ ధరకి కూడా సినిమాను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరికి ఏమీ చేయలేక సొంతంగానే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు నిర్మాత.


అసలే మాస్ సినిమాలకి అక్కడ ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది. అది కాక బాలకృష్ణకి ఓవర్సీస్ లో మార్కెట్ చాలా తక్కువ. కాబట్టి బాలకృష్ణ మీద ధైర్యం చేసే సాహసం చేయడం లేదు డిస్ట్రిబ్యూటర్లు. ఈ సినిమాని నిర్మాత స్వయంగా రిలీజ్ చేయడం వల్ల అక్కడ కలెక్ట్ చేసిన వసూళ్లులో టాక్స్, ఖర్చులు పోయిన తర్వాత మిగిలింది మీ తనది అనుకోవాలి. దీని ప్రకారం చూస్తే నిర్మాత జేబులోకి ఒక్క రూపాయి కూడా వెళ్లే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.

 

కొన్నిసంవత్సరాలు కిందట ఓవర్సీస్ మార్కెట్ నిర్మాతలకు ఒక కల్పతరువుగా మారింది . కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఎంత మంచి సినిమా అయినా అక్కడ కూడా కలెక్షన్లు రాబట్టాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం అమెరికాలో రిలీజ్ అయిన తెలుగు సినిమాలు కలెక్షన్ల పరంగా హిట్ అయిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. జనవరిలో విడుదలైన f2 , ఆ తర్వాత మజిలీ , ఓ బేబీ చిత్రాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి.

 

ఎంతో హిట్టవుతుంది అని ఆశలు పెట్టుకున్న మహేష్ బాబు మహర్షి కూడా అక్కడ విఫలమయ్యింది . ఒకప్పుడు నిర్మాతలు వాళ్ళు పెట్టిన ఖర్చు మొత్తం తెలుగు రాష్ట్రాలలో సంపాదించుకొని అమెరికాలో వచ్చినది ఆదాయం గా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: