దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య యావత్ ప్రజానికాన్ని కలచి వేసింది. 2012 లో నిర్భయ, 2019 లో ప్రియాంక..ఏం మారింది..? అంటు ప్రజలు నిలదీస్తున్నారు. నిజంగా ఇది సమాజానికి తలవంపులు చర్య అని ఎన్నో గొంతులు మొర పెట్టుకుంటున్నాయి. వీరికి తోడు సినిమా సెలబ్రిటిస్స్ కూడా ఆవేదనతో తమ సనుభూతిని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అనుష్క, కీర్తి సురేష్, పూనం కౌర్, రాం, కార్తికేయ వంటి సూపర్ స్టార్ ఇలాంటి వాళ్ళని నిర్ధాక్షణంగా నడి రోడ్డు మీదే ఉరి తీయాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే విషయంలో మహేష్ బాబు స్పందించారు. 

 

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్యో దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణమైన ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. మాకు వదిలేయండి చంపేస్తాం అంటూ అక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. మానవ మృగాల చేతిలో అత్యంత దారుణ హత్యకు గురైన ప్రియాంకా రెడ్డి ఘటనపై టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తరాలు మారుతున్నా మహిళలకు భద్రత కల్పించడంలో మనం విఫలమవుతున్నాం అంటూ ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

 

‘రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఓ సమాజంగా మనం ఓడిపోయాం. ఇలాంటి దారుణ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలి. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధిత మహిళలకు న్యాయం కోసం పోరాడుదాం. భారతదేశాన్ని ఆడవారికి సురక్షితంగా మార్చుదాం’ అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
వాస్తవంగా చూస్తే నిందులను వెంటనే శిక్షించాలి. కానీ రిమాండ్.. జైలు అంటు ఎందుకు ఇంతగా ఆలస్యం చేస్తున్నారంటు ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. నిముషాల్లో మృగాలుగా మారి మానభంగం చేసేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి క్షణాల్లో ఉరి శిక్ష పడే తీర్పుని ఎందుకివ్వడం లేదంటూ దేశంలో ఎంతోమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: