విజయ్ దేవరకొండ ఈ పేరు వింటే చాలు ఎక్క‌డా లేని క్రేజ్ ఒక్క‌సారిగా గుర్తొచ్చేస్త‌ది. పెళ్ళిచూపులు చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన విజ‌య్ ఆ చిత్రంతో మంచి విజ‌యం సాధించారు త‌ర్వాత వ‌చ్చిన గీత‌గోవిందం అమాంతం ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిపోయింది. విజ‌య్ పేరు చెబితే చాలు అమ్మ‌యిలంతా హా! అంటూ హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తారు. 

 

అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకు ఉన్న విష‌యం. కానీ ఇదంతా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కానీ ఇప్పుడు. భయంకరమైన మార్కెట్ తో ఓ ఊపు మీద ఉన్న విజ‌య్‌ డిమాండ్..అలాంటివి అన్నీ ఒక్కసారిగా కిందకు జారిపోయాయి. నోటా, డియర్ కామ్రేడ్ లాంటి దారుణమైన ఫ్లాపులతో విజయ్ మార్కెట్ చెల్లాచెదురు అయిపోయింది. మీకు మాత్రమే చెప్తా లాంటి స్వంత సినిమా పరాజయాన్ని కూడా విజయ్ ఖాతాలోకి జమేసారు.

 

ఇప్పుడు ఇవన్నీ కలిసి విజయ్ తరువాత సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' మీద పడ్డాయి. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే ఈ సినిమాను మరో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు ఫస్ట్ కాపీని 24 కోట్లకు తీసుకుంటా అని ముందుకు వచ్చారు. నాలుగు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు.

 

ఇదంతా ఆ సినిమా ప్రారంభించిన కొత్తలో  జ‌రిగిన సంగతి. కానీ ఇప్పుడు ఆ నాలుగు కోట్లు డెడ్ అయితే అయ్యాయి, సినిమా వద్దు అంటున్నారు. ఎప్పుడు రిటర్న్ ఇస్తే అప్పుడే వెనక్కు ఇవ్వండి, సినిమా అయితే వద్దు అని చదలవాడ శ్రీనివాసరావు నేరుగా ఈ విషయాన్ని నిర్మాత కేఎస్ రామారావుకే చెప్పేసినట్లు స‌మాచారం. 

 

సినిమా ఫిబ్రవరిలో విడుదల. ఇప్పటి వరకు ఆంధ్రలో ఈ సినిమాకు ఒక్క ఎంక్వయిరీ కూడా రాలేదని, అందుకే చదలవాడ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదృష్టం బాగుండి అంతా సరిగ్గా వుండి, వరల్డ్ ఫేమస్ లవర్ ఆడితే ప‌ర్వాలేదు. లేదంటే విజ‌య్ కు క‌ష్ట‌మే అని అంటున్నారు. అందుకే మైత్రీ హీరో సినిమాను పక్కన పెట్టి మరీ పూరి జగన్నాధ్ సినిమాను అర్జెంట్ గా స్టార్ట్ చేసేస్తున్నాడు విజయ్. అంటే పూరీ అయితే ప‌క్కా మాస్ యాంగిల్ లో ఉంటుంది కాబ‌ట్టి  ఆ సినిమా చేసి తిరిగి పూర్వ వైభ‌వం పొందాల‌నుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: