యాంకర్ రష్మి అంటే జబర్దస్త్ షోలో స్పెషల్ అట్రాక్షన్. జబర్దస్త్ కామెడీ షో కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అంచెలంచెలుగా  ఎదుగుతూ ఎంతో ఇమేజ్ ని సంపాదించుకుంది. ఓవైపు తెలుగు రాకపోయినప్పటికీ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ జబర్దస్త్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది యాంకర్ రష్మీ.తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులందరికీ మంత్రముగ్ధులను చేసింది. తన అందంతో జబర్దస్త్ అభిమానులందరినీ మతి పోగొట్టింది యాంకర్ రష్మి. జబర్దస్త్ కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది రష్మీ. అందం అభినయం వాక్చాతుర్యంతో అదరగొడతా జబర్దస్త్ షో సక్సెస్లో భాగంగా మారిపోయింది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో సుధీర్ రష్మీ కామెడీ కి చాలా పాపులారిటీ ఉంది. 

 

 

 

 అయితే ఈ అమ్మడు ఓన్లీ జబర్దస్త్ లోనే కాదండోయ్ సినిమాల్లో కూడా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తన అందాలను ఒలకబోస్తూ గ్లామర్ పాత్రల్లో మెరుస్తూ   ఎంతో మంది ప్రేక్షకులకు చెమటలు పట్టించింది హాట్ బ్యూటీ. గుంటూరు టాకీస్ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అందరి చూపులు తనవైపు తిప్పుకొని  చెమటలు పట్టించింది ఈ అమ్మడు. అటు మిగతా ఛానల్ లో కూడా యాంకరింగ్ చేస్తూ అదరగొడుతోంది. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ కి అవమానం జరిగిందని తన అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. రీసెంట్ ఎపిసోడ్ లో  జబర్దస్త్ లో ఒక స్పెషల్ ఏంటి వచ్చింది. అర్జున్ సురవరం ప్రమోషన్ లో భాగంగా హీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్బంగా  నిఖిల్ యాంకర్ రష్మి ని ఆట పట్టించారు. యాంకర్ రష్మీ ని చూసి ఆమె ఆర్టిస్ట్ తన్మయి  కదా, వినోదిని  అనే కదా అని అనడమే కాదు  రష్మీ అంటే ఎవరు అంటూ కామెంట్ చేశాడు నిఖిల్ . 

 

 

 

 దీంతో యాంకర్ రష్మీ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. రష్మీ కేవలం బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ఉంటే నిఖిల్ కి రష్మీ ఎవరో తెలియదు అనుకోవచ్చు కానీ రష్మీ అటు వెండి తెరపై కూడా ఎన్నో పాత్రల్లో  చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో తన సహచర నటి అయిన రష్మీ తనకు తెలియదంటూ నిఖిల్ కామెంట్ చేయడం పై రష్మీ అభిమానులు మండిపడుతున్నారట.  అయితే హీరో నిఖిల్ అభిమానులు మాత్రం ఇదంతా జబర్దస్త్ షోలో  కామెడీలో  భాగంగానే చేసిన ప్రయత్నం అంటూ అనుకుంటున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: