అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు మూడు లిరికల్ సాంగ్స్ కూడా బయటకు రిలీజ్ అయి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన సంపాదించడం జరిగింది. ఇక ఈ సినిమాపై  బన్నీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సామజవరగమనా సాంగ్ నిన్న 100 మిలియన్ వ్యూస్ అందుకుని, అత్యంత వేగంగా ఆ ఫీట్ ని అందుకున్న తెలుగు సాంగ్ గా యూట్యూబ్ లో సరికొత్త రికార్డు ని నమోదు చేయడం జరిగింది. 

 

ఇక గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో దీనిపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో బన్నీ ఎంతో బాగా నటించాడట. అన్నిటికంటే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ లో బన్నీ నటన అమోఘమని, ఆ సందర్భములో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో బన్నీ నటనకు ప్రేక్షకుల కళ్ళు కూడా చమర్చడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి. 

 

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను మంచి కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఎమోషనల్ సీన్స్ కూడా జత చేసినట్లు సమాచారం. సీనియర్ నటి టబు ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నివేత పేతురాజ్, సునీల్, అక్కినేని సుశాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: