ఇటివల జరిగిన  ఇళయదళపతి విజయ్ అభిమానుల మధ్య మరియు యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య  జరిగిన  గొడవ  ఎవరు గొప్ప డాన్సర్ అన్న విషయంలో ఏర్పడడం  రెండు రాష్ట్రాల సినీ ప్రేక్షకుల మధ్య కొంత అలజడిని సృష్టించింది.  వీళ్లిద్దరూ దక్షిణ భారతదేశంలోనే ఎవరి స్టైల్ లో వాళ్ళు సినిమాలు చేయడం  మరియు సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వీరు అఖండ విజయాలను సొంతం చేసుకుంటున్నారు .

సినిమా సినిమాకూ విభిన్నమైన నటనను  చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నారు. వీరిద్దరి నటనలో, డ్యాన్స్ లో, డైలాగ్ డెలివరి  ఇలా అన్నింటిలోనూ సమానమైన స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ తీస్తున్న సినిమాల్లో  ఫుల్ బిజీ గా ఉంటూ మంచి  ఫామ్‌లో ఉన్నారు. ఇల  వరుసగా సినిమాలు చేసుకుంటూ  విజయవంతంగా సాగిపోతు ముందుకు వెళ్తున్న వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా ఈ  హీరోల అభిమానుల మధ్య ఒక చిన్నపాటి మాటల యుద్ధం  జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని ఒకటి బయటకు వచ్చింది. విజయ్‌ ఇటీవల విజిల్   సినిమాతో తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని తన ఖాతా లో వేసుకున్న నిర్మాత మహేశ్ కోనేరు తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా అది మంచి విజయాన్ని కూడ బెట్టుకుంది. దీంతో ఆయన హీరో విజయ్‌ను కలిశారు.

రెండు  సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతున్న విషయాన్ని విజయ్ కి వివరించారు. దీనితో విషయం తెలిసిన విజయ్  ఆశ్చర్య పోయారని   విజయ్ జూనియర్ ఎన్టీఆర్‌లో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారని వారిద్దరూ మంచి స్నేహితులని ప్రకటించారు. ఈ  వార్త బయటకు రావడంతో ఈ గొడవకు  అభిమానులు  స్వస్తి  పలకవచ్చనె  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే అభిమానుల మధ్య ప్రశాంత వాతావరణాన్ని సృష్టించవచ్చని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: