నంద‌మూరి హీరోలు..నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయని తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ఎన్.టి.ఆర్ బయోపిక్స్ తర్వాత బాలయ్య, 118 తర్వాత కళ్యాణ్ ణ్ న‌టిస్తున్న కొత్త సినిమాలు రూలర్, ఎంత మంచివాడవురా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. వీటిలో బాలయ్య-కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో రూపొందిన రూల‌ర్‌ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్‌ ఎంత మంచివాడువురా సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు.

 

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల‌కు బిజినెస్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదని లేటెస్ట్ న్యూస్. బాల‌య్య రూల‌ర్ ప‌క్కా  మాస్ అంశాలతో రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా. అందుకనే ఈ సినిమాను ఓవ‌ర్సీస్‌లో కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. అంతేకాదు ఈ సినిమా బాలయ్య గెటప్స్ కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. అందుకే కాస్త ధైర్యం చేసి నిర్మాతనే ఓవ‌ర్సీస్‌లో రూల‌ర్‌ ను రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇక 2020  సంక్రాంతి సినిమాలనగానే ఆ రెండు పెద్ద సినిమాలే అందరికి కనిపిస్తున్నాయి తప్ప మూడో సినిమా అసలు జనాల మనసులో ఉందా... అంటే కాస్త అనుమానమే. మహేష్ చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ నటిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

 

కానీ ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న క‌ళ్యాణ్ రామ్‌ ఎంత మంచివాడవురా సినిమాకు జనాలలో కాస్త కూడా క్రేజ్ లేకపోవడం షాకయ్యో విషయం. అల వైకుంఠ‌పురంలో, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలతో అనవసరంగా కళ్యాణ్ రామ్ పోటీ పడి పొరపాటు చేశాడని నందమూరి ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు. ఇక ప్ర‌మోష‌న్స్ విషయంలోనూ కళ్యాణ్ రామ్ ఏమాత్రం పోటీ పడటం లేదు. ఇక ఈ భారీ సినిమాల నుంచి వచ్చిన టీజ‌ర్స్, ట్రైలర్స్ తో సినిమాకి బిజినెస్ పరంగా బాగా క్రేజ్ ని తెచ్చిపెడితే క‌ళ్యాణ్ రామ్ ఎంత మంచివాడ‌వురా సినిమా మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో బిజినెస్ విష‌యంలో కూడా అనుకున్న ఆఫర్స్ రావడం లేదని తాజా సమాచారం. కనీసం ఇప్పటి నుంచైనా కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాని గట్టెకించే ప్రయత్నాలు మొదలు పెడితే కాస్తైనా బయటపడే అవకాశాలుంటాయి. లేదంటే కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: