డియర్ కామ్రేడ్ సినిమా వరకు విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో యమా క్రేజ్ హీరో. ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని మార్కెట్. డిమాండ్..అలాంటిది అన్నీ ఒక్కసారిగా కిందకు జారిపోయాయి. నోటా, డియర్ కామ్రేడ్ లాంటి దారుణమైన ఫ్లాపులతో విజయ్ మార్కెట్ మొత్తం సున్నా స్థాయికి పడిపోయింది. 'మీకు మాత్రమే చెప్తా' లాంటి సొంత సినిమా డిజాస్టర్  కూడా విజయ్ ఖాతాలోకి వచ్చి పడింది.

 

చిలికి చిలికి గాలీ వానైనట్టుగా ఇప్పుడు ఇవన్నీ కలిసి విజయ్ కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' మీద పడ్డాయి. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే ఈ సినిమాను మరో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు ఫస్ట్ కాపీని 24 కోట్లకు తీసుకుంటానని ముందుకు వచ్చారు. నాలుగు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. ఇదంతా ఆ సినిమా ప్రారంభించినప్పటి సంగతి. కానీ ఇప్పుడు ఆ నాలుగు కోట్లు డెడ్ అయితే అయ్యాయని తాజా సమాచారం. సినిమా వద్దు అంటున్నారట. ఎప్పుడు రిటర్న్ ఇస్తే అప్పుడే వెనక్కు ఇవ్వండి, సినిమా అయితే వద్దు అని చదలవాడ శ్రీనివాసరావు నేరుగా ఈ విషయాన్ని నిర్మాత కేఎస్ రామారావుకే చెప్పేసినట్లు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది.

 

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజున విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆంధ్రలో ఈ సినిమాకు ఒక్క ఎంక్వయిరీ కూడా రాలేదని, అందుకే చదలవాడ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదృష్టం బాగుండి అంతా సరిగ్గా వుండి, వరల్డ్ ఫేమస్ లవర్ ఆడితే ఫరవాలేదు. లేదూ అంటే విజయ్ కు కష్టమేనని తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. అందుకే మైత్రీ మూవీస్ లో నటించాల్సిన 'హీరో' సినిమాను పక్కన పెట్టి మరీ పూరి జగన్నాధ్ సినిమాను అర్జెంట్ గా స్టార్ట్ చేసేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకోసం విపరీతంగా కష్టపడుతున్నాడు కూడా. అయితే రీసెంట్‌గా వచ్చిన వార్తల ప్రకారం కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పూరీ సినిమా కూడా కాస్త ఆలస్యం అవుతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: