బాలక్రిష్ణ వేగంగా సినిమాలు చేస్తాడని పేరుంది. దానికి తగినట్లుగానే ఆయన శరవేగంగా షూటింగ్ ముగించి రూలర్ మూవీని ఈ నెల 20 కి థియేటర్లకు తెస్తున్నాడు. రూలర్ లిరికల్ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ అయి కేక పుట్టించింది. బాలయ్య మార్క్ సాంగ్ లా దీన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్ లో బాలయ్య స్టైలిష్ లుక్స్ కట్ చేసి మరీ చూపించారు. ఇక టీజర్ కి, పోస్టర్ కి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. చిత్రమేంటంటే ఈ మూవీకి బాలయ్య మేకోవరే స్పెషల్ అట్రాక్షన్.

 

ఇక రూలర్ మూవీ ఈ నెల 20న రావడం ఖాయం. అయితే ఈ మూవీకి గట్టి పోటీయే ఉండేలా కనిపిస్తోంది. ఇదే డేట్ న మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగ రోజే మూవీ రిలీజ్ అవుతోంది. ఈ డేట్ కే  రవితేజా డిస్కో రాజా అనుకున్నా అది ఫిబ్రవరికి వెళ్ళింది. కానీ సాయి ధర్మ తేజ్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. బాలయ్యతోనే సై అంటున్నాడు.

 

ఇక ఇదే డేట్ మీద మరో రెండు మూవీస్ ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 తెలుగు డబ్బింగ్   మూవీతో పాటు, కార్తి నటించిన దొంగ డబ్బింగ్ మూవీ. తమిళ్ కార్తీకి తెలుగులో మార్కెట్ ఉంది. ఇక దబాంగ్ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అంటే నాలుగు సినిమాలతో బాలయ్య రూలర్ పోటీకి వస్తోందన్నమాట.

 

నిజానికి రూలర్ లాంటి మాస్ మూవీస్ కి సోలో రిలీజ్ అయితే బాగా హెల్ప్ అవుతుందన్న టాక్  ఉంది. అయితే మరో డేట్ కి వెళ్ళినా గట్టి  పోటీ ఉంది. వెంకీ మామ డిసెంబర్ 13 న అంటున్నారు. అది అటూ ఇటూ తిరిగి క్రిస్మస్ రోజు అయిన  25కి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా చెబుతున్నారు అందువల్ల పోటీ ఖాయంగా ఉంది. ఏది ఏమైనా అంచనాలు బాగున్నాయి కాబట్టి  హిటి టాక్ వస్తే  ఓపెనింగ్స్ కి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశ్యంతో బాలయ్య మూవీని రెడీ చేసేందుకు నిర్మాత కళ్యాణ్ రెడీ అవుతున్నారు. చూడాలి గుంపుతో వస్తున్న బాలయ్య సింహం ఎలా గర్జిస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: