బాహుబలి వంటి హిట్ తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాజా సినిమా సాహో తెలుగు లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయినా.. హిందీలో మంచి వసూళ్లు రాబట్టిందంటే.. ప్రభాస్ క్రేజ్ ఏం రేంజ్ లో ఉందో ఊహించొచ్చు. అయితే ఆయన తన తాజా సినిమా జాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ జాన్ సినిమా గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

 

వాటిలో ప్రధానమైంది.. సినిమా కథ గురించి. అయితే దీనిపై అనేక కథనాలు ఉన్నాయి. తాజాగా ఫిలింనగర్లో వినిపించే మాట ఏంటంటే.. ప్రభాస్ తాజా సినిమా జాన్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషస్తున్నాడట. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన బాహుబలి సినిమా ఎంత హిట్ అయ్యిందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభాస్ జాన్ సినిమా ద్వారా మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

 

అంతే కాదు.. ఈసారి ప్రభాస్ పునర్జన్మల ఆధారంగా వచ్చే కథను జాన్ కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా మలచాలే కానీ.. ఈ పునర్జన్మల ఆధారంగా ఇప్పటికే ఎన్నో కథలు వచ్చాయి. వాటి కంటే భిన్నంగా చూపించగలిగితే ఆకట్టుకోవడం చాలా సులభం. గతంలో రాజమౌళి ఈ కాన్సెప్టు తోనే మగధీర వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

 

జాన్ సినిమాలోనూ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. సినిమా కథ కూడా 1960 నాటిదని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా 1960 నాటిది ఉంటుందట. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి కథను ముడిపెడతారట. అంటే ప్రభాస్ తండ్రీ, కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ కాన్సెప్టు ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: