రామ్ గోపాల్ వర్మ.. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీ హిట్లిచ్చిన ఈ దర్శకుడు.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడా అదరగొట్టాడు. అయితే అక్కడి నుంచి మళ్లీ మాతృభాషకు వచ్చిన తర్వాత ఆయన మరింతగా విమర్శలపాలవుతున్నారు. కేవలం బయోపిక్కులను నమ్ముకుని.. ఆయన సినిమాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

 

పరిటాల రవి, ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు..ఇలా కాంట్రావర్సీ స్టోరీలు తీసుకుని వాటిని బయోపిక్కులుగా రూపొందిస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మకు ఫ్యాన్స్ ఎంత మందో అంతకంటే రెట్టింపు సంఖ్యలో ద్వేషించే వారూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి కొందరు కలిసి రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీయాలని నిర్ణయించారట.

 

అలాంటి వారిలో మొదటి వ్యక్తి.. రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. గతంలో ఓ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా సాక్షిగా జరిగింది. ఇప్పుడు అదే జొన్నవిత్తుల ఆర్జీవీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ముల్లును ముల్లుతోటే తీయాలి అన్నట్లుగా, అందరి మీద సినిమాలు తీసే ఆర్జీవీకి సినిమాతోనే చెక్ చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

అంతే కాదు.. ఆర్జీవీ బయోపిక్ కోసం ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే నటుడిని కూడా ఇప్పటికే గుర్తించేశారట. ఆర్జీవీ మాదిరిగానే వుండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్ లో వున్నట్లు తెలుసుకున్న తర్వాత.. అతడికి ఈ సినిమాకు ఒప్పించారని తెలుస్తోంది. మరి జొన్నవిత్తుల వద్ద సినిమా తీసేంత డబ్బు ఉందా అని అనుమానిస్తున్నారా..

 

ఈ సినిమాకు ఆర్జీవీ వ్యతిరేకులు చాలా మంది తెరవెనుక సాయం చేసే అవకాశం పుష్కలంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ బయోపిక్ సినిమా ఏకంగా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో అన్నింటికంటే హైలెట్ గా వర్మ పోర్నో సినిమాల వ్యవహారం ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: