అతి త్వరలో రానున్న పెద్ద పండుగలైన క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ లో సినిమాల హవా కూడా పూర్తిగా ఉండబోతోంది. ఇక ఆ సమయంలో రిలీజ్ కు సిద్ధం అవుతున్న సినిమాలు ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలపై గట్టిగా దృష్టిపెట్టాయి. ముందుగా క్రిస్మస్ కానుకగా బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రూలర్, సాయి ధరమ్ తేజ్, మారుతిల కాంబినేషన్లో రానున్న ప్రతిరోజు పండగే, అలానే కార్తీ హీరోగా తెరకెక్కుతున్న దొంగ సినిమాలు ఉండగా, దాని తరువాత సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్

 

అనిల్ రావిపూడిల సరిలేరు నీకెవ్వరు, బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో, సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మురుగదాస్ ల కాంబినేషన్లో రాబోతున్న దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ మరియు సతీష్ వేగేశ్న కలయికలో రాబోతున్న ఎంత మంచివాడవురా, అలానే వెంకటేష్ మరియు నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక వీటిలో ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు, కార్తీ దొంగ మరియు బాలకృష్ణ రూలర్, అలానే వెంకటేష్, నాగచైతన్యల వెంకీ మామ, 

 

కళ్యాణ్ రామ్ సతీష్ వేగేశ్న ల ఎంతమంచివాడవురా సినిమాల ఫస్ట్ లుక్ టీజర్లు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన సంపాదించడం జరిగింది. ఇకపోతే ఈనెల 5 మరియు 6 తారీఖుల్లో ఈ జాబితాలోని మిగతా సినిమాల నుండి ఫస్ట్ లుక్ టీజర్లు మరియు ఆల్రెడీ టీజర్లు రిలీజ్ అయిన సినిమాల నుండి లిరికల్ సాంగ్స్ పెద్ద ఎత్తున రిలీజ్ కానున్నాయి. దీనిని బట్టి ఆ రెండు రోజులు కూడా యూట్యూబ్ పలు రికార్డు వ్యూస్ మరియు లైక్స్ తో హోరెత్తిపోవడంతో పాటు బద్దలవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమాల్లో ఏవేవి విజయాలు అందుకుంటాయో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: