టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూజ హెగ్డేల కలయికలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా శ్రోతలను విపరీతంగా అలరించడంతో పాటు యూట్యూబ్ లో అత్యద్భుతంగా లైక్స్ మరియు వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి టబు, బన్నీకి అక్కడగా నటిస్తుండగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ, బన్నీకి తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. 

 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు బయటకు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే, అసలు ఈ సినిమా గట్టెక్కుతుందా అనే అనుమానాన్ని పలువురు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక వార్త ప్రచారం అయింది, అదేమిటంటే, సినిమాలో ఎక్కువగా సెంటిమెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఇది కూడా గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరిగా ఓవర్ ఆల్ గా యావరేజ్ గా నిలిచే అవకాశాలు మాత్రమే ఉన్నాయి అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. 

 

ఇకపోతే గత రెండు రోజుల నుండి ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు కథ నుండి కాపీ కొట్టి దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని, అలానే కథ పరంగానే కాక అందులోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా పెద్దగా మార్పు చేయకుండా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సో, ఈ విధంగా చూస్తే అలవైకుంఠపురములో సినిమా ఎక్కువశాతం నిలబడే అవకాశాలు తక్కువే అనేది వారి వాదన. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: