మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఇయర్ ఎఫ్-2, గద్దలకొండ గణేష్ ఈ రెండు సినిమాలతో క్రేజీ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సినిమా కథ దాదాపుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి డైరెక్ట్ చేసిన జానీ సినిమాను పోలి ఉంటుందట.  

 

పవన్ సూపర్ ఫాంలో ఉన్న టైంలో జానీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా నిరాశపరచింది. అందులో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. కాని కొద్ది తప్పుల వల్ల అది ప్రేక్షకులకు ఎక్కలేదు. ఇప్పుడు ఆ కథనే పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో మరో సూపర్ హిట్ అవుతుందని అనంటున్నారు చిత్రయూనిట్. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జానీనే వరుణ్ తేజ్ రీమేక్ చేయడం మెగా ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. ఫ్లాప్ సినిమా వరుణ్ ఎందుకు ఎంచుకున్నాడని అంటున్నారు. అయితే ఆ సినిమా కంటెంట్ సరిగా ప్రెజెంట్ చేయలేదు కాబట్టే నిరాశపరచింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. 

 

ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వచ్చే సినిమా కూడా ఇలాంటి కథతోనే వస్తుందని అంటున్నారు. వరుణ్, విజయ్ ఇద్దరు యువ హీరోల్లో మంచి జోష్ ఫుల్ కెరియర్ తో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకే తరహా కథలతో వస్తే ఎలా అంటున్నారు ఆడియెన్స్. కథలు కొద్దిగా దగ్గరగా ఉన్నా పూరి టేకింగ్ వేరే డైరక్టర్స్ కు చాలా తేడా ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: