అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ స్టేటస్ కు వెళ్ళిపోయిన రష్మికతో నటించడానికి టాప్ యంగ్ హీరోలు అందరు తమ ఆసక్తి కనపరుస్తున్నారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి నిత్యం సందడి చేసే రష్మిక లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటోకి ఆమె ఇచ్చిన ఆసక్తికర క్యాప్షన్ పై మహేష్ నితిన్ అభిమానులలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. 

‘ఈ పిక్చర్ లో ఒకే ఒక్కటి మిస్సింగ్. అది మంకీ.. నా ప్లస్ వన్ మంకీ!`` అంటూ ఏదేదో  అర్థమయ్యీ అవ్వనట్టు ఒక కామెంట్ చేసింది. ఒక రకంగా ఆ మిస్సయిన మంకీ ఎవరో కనిపెట్టండి’ అంటూ తన ఫ్యాన్స్ కి రష్మిక పజిల్ వేసిందనే అనుకోవాలి. ఇప్పుడు ఆమె మహేష్ నితిన్ ల సినిమాలలో నటిస్తున్న నేపధ్యంలో వారిద్దరిలో ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి జోక్ వేసిందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

మహేష్ జెంటిల్మన్ కాబట్టి అతడిని అంత చనువుగా మంకీ అని పిలిచే సాహసం రష్మిక చేయదని నితిన్ మాత్రం ఇంకా బ్యాచిలర్ కాబట్టి అతడిని చనువుగా మంకీ అని జోక్ చేసి ఉంటుంది అంటూ ఆమె అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. నితిన్ లేటెస్ట్ గా రష్మికతో నటిస్తున్న ‘భీష్మ’ లో రష్మిక అతడిని వెంటపడుతూ నితిన్ ప్రేమలోకి దింపే కోతి వేషాలు రష్మిక వేస్తుందని వార్తలు వస్తున్నాయి.

అందువల్లనే ఆ మిస్ అయిన కోతి నితిన్ మాత్రమే అంటూ ఆమె అభిమానులు రష్మిక పజిల్ కు సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ పజిల్ లో అనుకోకుండా మహేష్ పేరు కూడ వచ్చి చేరడం ప్రిన్స్ అభిమానులకు నచ్చక పోవడంతో ఆమె వేసిన జోక్ ఏమి బాగాలేదు అంటూ మహేష్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: