బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని  టీవీలకు కట్టిపడేసిన షో  బిగ్ బాస్  తెలుగు సీజన్ 3. 16 మంది సెలబ్రిటీలు తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 షో  గత కొన్ని వారాల క్రితం ముగింపు పలికింది. కాకా ఈ షోలో  రాహుల్  సిప్లిగంజ్ టైటిల్  విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్  లో తనదైన శైలిలో ఆటలు ఆడుతూ టాస్కుల్లో దుమ్మురేపుతూ  ఒక రేంజ్ లో అభిమానులను  సంపాదించుకున్నారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక  రాహుల్ సిప్లిగంజ్ కు లక్కు  బాగా కలిసొస్తుంది. బిగ్ బాస్ లో చాలా ఫేమస్ అయిన రాహుల్ బిగ్ బాస్  హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. 

 

 

 

 ఓ వైపు పాటలతో మరోవైపు సినిమా అవకాశాలతో దుమ్మురేపుతున్నారు  రాహుల్ సిప్లిగంజ్  . గత కొన్ని రోజులుగా వరుస పాటలతో అభిమానులందరినీ హోరెత్తిస్తున్నారు రాహుల్ సిప్లిగుంజ్. టాప్ హీరోల సినిమాల్లో రాహుల్  సిప్లిగంజ్  పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడుతున్న పాటలన్నీ సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపేస్తున్నాయి . తెలుగు ప్రేక్షకులందరికీ తన ఊపున్న   పాటలతో హోరెత్తిస్తున్నారు. అంతేకాదండోయ్  మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కృష్ణవంశి దర్శకత్వంలో ప్రకాష్రాజ్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న రంగమార్తాండ  సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు  తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. 

 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్ తన  ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. గొప్ప నటులతో అద్భుతమైన చిత్రం లో భాగం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు. నటుడిగా తనకు ఇది తొలి సినిమా అని మీ ఆశీర్వాదం కావాలి అంటూ అభిమానులను కోరాడు  రాహుల్ సిప్లిగంజ్. ఈ సినిమాలో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్  హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ లక్కు మారిపోయినట్టు  కనిపిస్తోంది. వరుస అవకాశాలు రావడంతో పాటు ఈ సింగర్ కు  ఏకంగా సినిమా అవకాశాలు కూడా వచ్చి పడుతుండటంతో  అభిమానులు మాత్రం సంతోషం లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: