తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ  కడుపుబ్బ నవ్వించే కామెడీ షో జబర్దస్త్. కానీ ప్రస్తుత ఈ షో సమస్యల్లో పడిపోయింది. ఈ షో  నుండి  ఒక్కరొక్కరుగా అందరూ వెళ్లిపోతున్నారు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జ్  గా కొనసాగుతున్న నవ్వుల నాగబాబు జబర్దస్త్ నుంచి జడ్జిగా తప్పుకొని జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్ లో  ప్రత్యక్షమయ్యారు. దీంతో జబర్దస్త్ జడ్జ్  గా నాగబాబు రేంజ్  ఉన్న వారిని ఎవరిని తీసుకు రావాలni మల్లెమాల యాజమాన్య మంతనాలు జరుపుతూనే ఉంది. కాగా  జబర్దస్త్ జడ్జ్ గా ఇప్పటివరకు ఎవరిని మాత్రం తీసుకోలేదు.  అయితే తమ సినిమాల ప్రమోషన్స్  చేసుకోవడానికి వచ్చిన హీరోలు మాత్రం నాగబాబు సీట్లో కూర్చొని జబర్దస్త్ జడ్జిస్ గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో   90 ఎమ్మెల్ సినిమా హీరో కార్తికేయ జబర్దస్త్ జడ్జ్ గా  చేసారు. 

 

 

 

 అయితే ప్రస్తుతం జబర్దస్త్ కి రోజా ఒక్కరే  న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం సోలో  జడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజాకు షో నిర్వాహకులు ఇంతకు ముందు కంటే రెమ్యూనరేషన్ భారీగా  పెంచినట్లు తెలుస్తోంది. గతంలో జబర్దస్త్ ఎపిసోడ్స్ కి 1.5 లక్షలు తీసుకునేది  రోజా. ఎమ్మెల్యేగా రెండో సారి  ఎన్నికైన తర్వాత  రెండు లక్షల వరకూ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. జబర్దస్త్ నుంచి నవ్వులు నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో... జబర్దస్త్ కి ప్రస్తుతం సోలో  జడ్జి గా వున్నా రోజా మరి ఏదైన షో కి తప్పుకునే  అవకాశాలు ఉన్నాయనే అనుమానంతో ఆమె పారితోషికాన్ని లక్షల వరకు షో  యాజమాన్యం పెంచినట్లు సమాచారం. దీంతో జబర్దస్త్ లో భారీగానే పారితోషికాన్ని అందుకున్నారు రోజా. 

 

 

 

 ఏపీఐఐసీ చైర్మన్గా రోజాకు నెలకు 3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటుంది. ఇక ఎమ్మెల్యే గా వచ్చే జీతం కూడా అదనం . దీంతో దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకుంటుంది రోజా. జబర్దస్త్ లో రోజా సోలో  జడ్జిగా వ్యవహరిస్తున్న... నాగబాబు లేని లోటు మాత్రం తీరుస్తున్నట్లు  తెలుస్తోంది. అంతేకాకుండా ఒకప్పుడు జబర్దస్త్ లో చేసే కమెడియన్స్ అందరికీ షో నిర్వాహకులు అందరికీ పలు సూచనలు చేసేవారు నాగబాబు  ప్రస్తుతం ఆ బాధ్యతను జబర్దస్త్ షో లో సోలో జడ్జ్  రోజా తీసుకున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్ కి పలు సలహాలు ఇస్తుండంతో పాటు... జబర్దస్త్ ని  కమెడియన్స్ వీడకుండా చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: