రామ్ గోపాల్ వర్మకు కష్టాలు ఒకదాని పై ఒకటి వచ్చిపడుతున్నాయి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మార్చినా సెన్సార్ ఈ మూవీకి అనేక కట్స్ చెప్పడంతో ఈ మూవీలోని చాల కీలక సన్నివేశాలు పోతాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ మూవీ విషయమై వర్మ సుప్రీమ్ కోర్టుకు కానీ లేదంటే ముంబాయ్ సెన్సార్ కేంద్ర ఆఫీసుకు కాని ఫిర్యాదు చేసుకునే అవకాశాలు ఉన్నా ఆ విషయాలు రోజులలో తేలిపోవు నిర్ణయం వచ్చే సరికి చాల సమయం పడుతుంది. ఈ లోపున క్రిస్మస్ సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైపోతుంది కాబట్టి వర్మ సినిమాకు ఇప్పట్లో మోక్షం లేనట్లే అన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రముఖ కవి జొన్నవిత్తుల ఏకంగా సినిమా నిర్మాతగా మారి రామ్ గోపాల్ వర్మ పై ఒక బయోపిక్ తీసే ప్రయత్నాలు ప్రారంభించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. జోన్నవిత్తలు ప్రయత్నాల వెనుక వర్మను వ్యతిరేకించే కొందరు కీలక వ్యక్తుల సహాయం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు మధ్య ప్రదేశ్ లో రామ్ గోపాల్ వర్మను పోలిన ఒక వ్యక్తిని చూడటంతో పాటు అతడిని వర్మ బయోపిక్ లో నటించే విధంగా ఒప్పించినట్లు తెలుస్తోంది. వర్మ నిజ స్వరూపాన్ని బయటపెడుతూ అతడి జీవితంలోని అనేక చీకటి కోణాలను ఈ మూవీలో చూపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ వెనుక ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖ సామాజిక వర్గానికి చెందిన వ్యాపార వేత్త జొన్నవిత్తుల వెనుక ఉన్నట్లు గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తోంది కాబట్టి ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: