చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ‘సైరా’ కలక్షన్స్ కూడ అదే స్థాయిలో వస్తాయని ఆశించారు. ఒక సందర్భంలో అయితే ‘సైరా’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ఊహాగానాలు కూడ వచ్చాయి. అయితే వాస్తవాలు వేరు అంటూ మరి కొన్ని వార్తాహాలు ప్రచారంలోకి వస్తున్నాయి. 

మూవీ బాలీవుడ్ లో ఫ్లాప్ అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి కలక్షన్స్ రాబట్టినా ఈ మూవీ బయ్యర్లు చాల చోట్ల నష్టపోయినట్లు గాసిప్పులు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ‘సైరా’ లెక్కలను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించి ఏ ఏరియాలో ఎంత కలక్షన్స్ వచ్చాయి అందులో వాస్తవాలు ఎన్ని లేదంటే ప్రచారం ఎంత అన్న విషయాల పై నిగ్గు తేల్చడానికి చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ లెక్కలు చూస్తున్నట్లు టాక్. ఈ లెక్కలు చూసే విషయంలో చిరంజీవికి కొన్ని షాకింగ్ విషయాలు ఎదురౌతున్నాయి అంటూ కొన్ని గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. 

ఈ మూవీలో నటించిన కీలక నటీ నటులు అందరికీ వారి స్థాయికి మించిన పారితోషికాలు ఇచ్చినట్లు చిరంజీవికి తెలిసిన విషయమే అయినా ఈ మూవీలో కేవలం పది నిముషాల పాత్రలో నటించిన ఒక క్యారెక్టర్ నటుడుకి 70 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు లెక్కలు కనిపిస్తున్న ఫిగర్ ను చూసి చిరంజీవి షాక్ అయినట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టుల పారితోషికానికి సంబంధించిన బిల్లు 7 కోట్ల స్థాయిలో ఉండటం చిరంజీవికి మరింత షాక్ ఇచ్చిందని అంటున్నారు. దీనితో ‘సైరా’ లెక్కలు చూసి చిరంజీవి మైండ్ బ్లాంక్ అవుతోందని గాసిప్పులు గుప్పు మంటున్నాయి. ఈ వార్తలలో వాస్తవాలు తెలియకపోయినా ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: