తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న వెబ్​సిరీస్​ 'క్వీన్'.. రమ్యకృష్ణ ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రలో నటిస్తోంది. కాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహలు జరుగుతున్నాయి. ఇకపోతే 2016 లో అనారోగ్య కారణాలతో కన్నుమూసిన జయలలిత మరణం ఒక మిస్టరీగా మిగిలింది. అయితే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు.

 

 

ఇప్పటికే  కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ సినిమా చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే ఒక వైపు పొగడ్తలు మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదీగాక  నిత్యామీనన్, జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.  మరోవైపు విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఒక బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇవి చాలవన్నట్టు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. అమ్మ జయలలిత జీవితంపై రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఒక  వెబ్ సిరీస్ ‌తెరకెక్కిస్తున్నాడు.

 

 

ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేసారు. ఇకపోతే ఓ సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్య మంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. ఇక ఈ వెబ్ సిరీస్‌ లో స్కూల్ చదివే రోజుల్లో జయలలిత టాపర్. 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్. చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయిన వనితగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందట.

 

 

ఇక చిత్ర యూనిట్ ఈ నెల 5న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందు రానుంది. కాగా దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి రెండో సీజన్‌ను తెరకెక్కిస్తారట. ఇదే కాకుండా ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి తమిళంతో పాటు తెలుగు, హిందీలో తెరకెక్కించ నున్నారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్‌ను మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: