అర్జున్ సుర‌వరం నిఖిల్‌, లావ‌ణ్యత్రివాఠి జంట‌గా న‌టించిన చిత్రం. ఈ చిత్రం చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుని కొన్ని వివాదాల న‌డుమ ఇటీవ‌లె విడుద‌లైంది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసిన విష‌యం తెలిసిందే. సినిమా ఫంక్ష‌న్‌లో చిరంజీవి ప‌వ‌న్‌కళ్యాణ్ మ్యాన‌రిజ‌మ్ ని అనుస‌రించారు. అది కావాల‌ని చేశారో లేక యాధృచికంగా అయ్యిందో తెలియ‌దుకాని అదే ఆ ఫంక్ష‌న్‌కి హైలెట్ అయింది. ఇక నెటిజన్ల గురించి తెలిసిందేగా ఏదైనా చిన్న ఇన్‌సిడెంట్ ఉంటే చాలు ఆడేసుకుంటారు.

 

అర్జున్ సురవరం సినిమాలో చెగువేరాపై ఓ పాట ఉంటుందని, అది చూసినప్పుడు తనకు తమ్ముడు పవన్ కల్యాణే గుర్తుకొచ్చారని సెలవిచ్చారు చిరు. ఇక చూస్కోండి, చిరుని, పవన్ ని అందరూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అసలు పవన్ కీ చెగువేరాకీ పోలిక ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం పవన్ ని చూసి చెగువేరానే స్ఫూర్తిపొందినట్టు చెప్పలేదు అని సెటైర్లు పేలుస్తున్నారు.

 

చెగువేరాకి కూడా మెడ గోక్కునే అలవాటుందా అని మరికొందరు చెడుగుడు ఆడేసుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి కష్టాలు అనుభవించి, చివరికి ఆ సిద్ధాంతం కోసం త‌న ప్రాణాన్ని సైతం లెక్క‌చెయ్య‌ని వీరుడు చెగువేరా. మరి పవన్ కల్యాణ్.. జనసేన పేరు చెప్పి, ప్రశ్నిస్తానంటూ ప్రజల ముందుకొచ్చి, చంద్రబాబుతో లాలూచీ పడి, ప్యాకేజీలతో సర్దుకుని కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప‌వ‌న్‌.

 

చెగువేరా ఒక‌ డాక్టర్. చాలా తెలివైన‌వారు. మ‌రి ప‌వ‌న్ కు అంత స‌బ్జెక్ట్ లేని విష‌యం మ‌న‌కు తెలిసిందే. చెగువేరా ఎప్పుడూ అధికారం కోసం ఆరాపటపడలేదు, పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన నిస్వార్థపరుడు. గెరిల్లా పోరాటంలో ఆయన కోసం వందలాది మంది ప్రాణాలర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. పవన్ కనీసం తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలవలేకపోయారు. అసలు చేగువేరాకీ, పవన్ కీ పోలికేంటి? చేగువేరాతో పవన్ ని పోల్చే సాహసం ఏంటి? అని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక అన్న‌య్య త‌మ్ముడు మాట ఎత్తి మ‌రీ ప‌నిమాల తిట్టించిన‌ట్లు ఉంది ఈ వైనం.

మరింత సమాచారం తెలుసుకోండి: