గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా మహిళలపై వరుసగా అత్యాచారాల పర్వం నడుస్తుంది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  చిన్నారులపై అత్యాచారాలు, వృద్దులపై లైంగిక వేధింపులు..అత్యాచారాలు. ఇక మహిళళు కంటికి కనిపిస్తే చాలు కొంత మంది చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు.  ఆడవారిపై అత్యాచారాలు మాత్రమే కాదు..ఏకంగా హత్యలకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి పై అఘాయిత్యం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన చంపేసిన తర్వాత కూడా ఆ కామాంధులు మృతదేహంపైనా అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలం సృష్టిస్తుంది.  ప్రియాంక ఘటనపై టాలీవుడ, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని సినీ పరిశ్రమ సెలబ్రెటీలు దుమ్మెత్తి పోస్తున్నారు.  ఆ దుర్మార్గులకు ఉరి సరైన శిక్ష అంటూ నినాదాలు ఇస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ..ఇలాంటి నీచులకు వెంటనే కఠినమైన శిక్ష పడితే..అలా చేయడానికి ఎవరైనా భపడతారని అన్నారు. అలాగే కొంతమంది నెటిజన్స్ చేసిన మరొక కామెంట్ కి అందరు ఆలోచించేలా మెగా హీరో ఉదాహరణ ఇచ్చారు.

 

 ‘ ప్రతిరోజు పండగే’ సినిమాలో కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేయగా.. అందులో హీరోయిన్ పై హీరో చేయి వేసి ఉండడంతో కొంత మంది ‘హాథ్ నికలో’ - చెయ్ తియ్ అంటూ పోస్ట్ లు పెట్టారని అన్నారు. నిజమే మీ ఇన్ టెన్షన్ బాగుంది..కానీ అది ఆచరణలో ఉంటే ఇంకా బాగుంటుందని.. సినిమా అని తెలిసి కూడా ఇలా కామెంట్ చేస్తున్నారు. అందరు ఇలానే మన తోటి అమ్మయిల గురించి కూడా ఆలోచిస్తే.. తెలంగాణ నిర్భయ లాంటి ఘటన మన సొసైటీలో జరగవు కదా అని వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: