ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో లోక్ సభ లో విపక్ష పార్టీలు అన్ని ప్రియాంక రెడ్డి అత్యాచారం కేసు అనగా దిశ రేప్‌ ఘటనపై చర్చ జరగాలని మొత్తం పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలన్నీ వాయిదా తీర్మానం చేపట్టాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా జీరో అవర్‌ లో చర్చిద్దామని సభ్యులకు తెలిపారు. దీంతో క్వశ్చన్‌ అవర్‌ను రద్దు చేసి వెంటనే దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు గట్టిగా పట్టుబట్టడంతో  పార్లమెంటులో గందరగోళ వాతావరణం నెలకొంది.

 

అయితే తాజాగా ఈ ఘటనపై ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటున్నారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దిశ ఘటన మీద రాజ్యసభలో చర్చ జరుగుతోంది. దేశాన్ని మొత్తం కలచివేసింది దిశ హత్య అంటూ కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇటువంటి కఠిన శిక్షలు చట్టాలు రావటం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను ఇంకా అనేక సమస్యలను పరిష్కరించాలంటే వాటి మూలాల నుంచి తొలగించే కార్యక్రమం ప్రభుత్వాలు చేపట్టాలని పేర్కొన్నారు.

 

ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తాను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల దిశ హత్య అత్యాచారం ఘటనపై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో నిందితులను పెంచి పోషించడం టైం వేస్ట్ అవుతుంది...వెంటనే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: