రాజకీయాల్లో ఉండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్నాడు కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అంతేకాకుండా కొణిదల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ బ్యానర్ పెట్టి సొంత బ్యానర్లోనే చిరంజీవి రాజకీయాల నుండి వచ్చిన తర్వాత చేసిన సినిమాలు మాత్రం నిర్మాణం అయ్యేలా వెనక నుండి చక్రం రామ్ చరణ్ తేజ్ తిప్పాడు. 'ఖైదీనెంబర్150' మరియు అదే విధంగా 'సైరా ' సినిమాలను దగ్గరుండి నిర్మాణ భాగస్వామ్య బాధ్యతలను చూసిన నిర్మాత రామ్ చరణ్ తేజ్ కొరటాలతో నెక్స్ట్ చేయబోయే చిరంజీవి సినిమా విషయంలో రామ్ చరణ్ పూర్తిగా పక్కన పెట్టి ఆ సినిమాకి సంబంధించిన పూర్తి బాధ్యత తనపై వేసుకోవడానికి చిరంజీవి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.

 

ముఖ్యంగా కొడుకు రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వం లో ‘RRR’ సినిమా చేస్తున్న నేపథ్యంలో చెర్రీ కెరియర్ పాడవకుండా చిరంజీవి ఈ నిర్ణయం సరికొత్తగా ఈ తీసుకున్నట్లు సమాచారం. కొరటాల సినిమా ప్రతి విషయంలో మెగాస్టార్ అన్నీ తానై దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. రీసెంట్ గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ మ్యూజిక్ కోసం మణిశర్మ - కొరటాల శివతో కలిసి బ్యాంకాక్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ప్రశాంతంగా సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి పాటల ట్యూన్స్ వరకు అన్ని పనులను అక్కడే ఫినిష్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారట.

 

మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మరోపక్క రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు కొట్టడంతో ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి లో మొదలుపెట్టి వచ్చే సమ్మర్ కి సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: