మజిలీ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న హీరో నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కెప్టెన్ కార్తిక్ గా మనకి కనిపించబోతున్నాడు. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు కలిసి చేస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు బాగానే ఉన్నాయి. సెంటిమెంట్ ప్రధానంగా ఉండే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకర్షిస్తుందట.

 

అయితే వెంకీ మామా తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడట. ఈ విషయమై ఇంతకుముందే సమాచారం వచ్చినప్పటికీ అసలు ప్రీ ప్రొడక్షన్ మొదలైందా లేదా అనేది ఇప్పటి వరకు తెలియలేదు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక సమాచారం బయటకి వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నాగచైతన్య ఈ సినిమాలో గ్రామీణ ప్రాంతానికి చెందినవాడిగా కనిపిస్తాడట. అది కూడా తెలంగాణ ప్రాంతం వాడిగా కనిపిస్తాడట.

 

అందుకోసం నాగచైతన్య తెలంగాణ యాస్ నేర్చుకునే పనిలో ఉన్నాడట. నేర్చుకోవడం ఏదో మామూలుగా కాదట. ఆ యాసలో పట్టు వచ్చేలాగా నేర్చుకుంటున్నాడట.  పాత్ర గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ మన పరిశ్రమలో తెలంగాణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే హీరో పాత్రలు చాలా తక్కువ.. అలాంటి అరుదైన పాత్రల్లో చైతూ చేస్తున్న క్యారెక్టర్ ఒకటని అన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

 

 

సాయి పల్లవి పల్లెటూరి నుండి నగరానికి వచ్చిన అమ్మాయిగా కనిపించనుందట. ప్రేమ కథా చిత్రాలని తనదైన శైలిలో తీర్చిదిద్దే శేఖర్ కమ్ముల ఈ సినిమాని ప్రేక్షకులకి నచ్చేలా మలుచుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.  మరి ఈ సినిమా కూడా "ఫిదా" లా హిట్ అవుతుందేమో చూడాలి. ఫిధా సినిమా కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమానే.

మరింత సమాచారం తెలుసుకోండి: