ప్రస్తుతం  ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ  వీడియో అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత లీకవడం చాల ఆశ్చర్యంగా వుంది.ఇక అస్సలు విషయానికి వస్తే .. స్పెయిన్‌లో బిగ్‌బ్రదర్‌ ఆధారం నడుస్తున్న బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో   గా  ‘గ్రాన్‌ హెర్మానో’ షో ప్రసారమవుతోంది.  2017  జరిగిన ఈ షో సీజన్‌లో  స్పానిష్‌ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది.

 

ఇందులో ఆమె ప్రియుడు జోస్‌ మారియా లోపెజ్‌ ఆ హౌస్‌లోకి  వచ్చాడు.ఆ షోలో  వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడిపోయారు. ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది.

 

దీంతో మారియా లోపెజ్‌ను షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా షో నుంచి పంపించేశారు. దీని తర్వాత పోలీసులు  అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఓ గదిలోకి కార్లోటాను  పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసిన   కార్లోటా.. ఆపండి.. ప్లీజ్‌.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే, షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు చూపించారు.

 

షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్‌ చేయలేదు కానీ బయటకు లీకవకుండా కాపాడలేకపోయింది. పైగా వీటిని ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం కొన్ని కంపెనీలు  చేస్తున్నాయి ఇది చాలా  సిగ్గుచేటు. దీనిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు అక్కడి ప్రజలు .అంతే కాకుండా  నిందితుడిని శిక్షించాలని.. అంతేకాక నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: