టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కనిపిస్తోంది. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కామన్ అయిపోయింది. హీరో కు సూట్ అయ్యే స్టెప్పులు వేయించటమే  కాదు అదిరిపోయే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేస్తూ ఒక రేంజ్ లో పాపులర్ అయిపోయారు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు ఢి లో  కంటెస్టెంట్ గా వచ్చిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఏకంగా ఢీ  షోకు జడ్జీగా మారిపోయే తనదైన స్టైల్లో అదరగొడుతున్నారు శేఖర్ మాస్టర్. అయితే ఢీ షోలో  ఒక రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ హీరోగా వస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.కాగా ఇప్పుడు  అభిమానుల కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. 

 


 ఇప్పుడు శేఖర్ మాస్టర్ కాస్త హీరో శేఖర్ గా మారబోతున్నాడు అని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. శేఖర్ మాస్టర్ కు జోడిగా కూడా అదిరిపోయే హీరోయిన్ నటిస్తోందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు అందాల ముద్దుగుమ్మ రష్మి గౌతమ్. రేష్మి గౌతమ్ శేఖర్ మాస్టర్ చిత్రంలో నటించబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే డీ ఛాంపియన్స్ తో పాటు మరికొన్ని చోట్ల లో శేఖర్ మాస్టర్ రష్మీ  ఆకట్టుకోవడంతో ఈ  జోడికి మంచి ఇమేజ్ కూడా ఉంది. అయితే శేఖర్ మాస్టర్ ని హీరోగా పరిచయం చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా బాగానే ఆసక్తితో  ఉన్నట్లు తెలుస్తోంది.. 

 


 రష్మి గౌతమ్ కూడా శేఖర్ మాస్టర్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేనట్లు కనిపిస్తోంది. గతంలో గుంటూరు టాకీస్ అంతం లాంటి సినిమాల్లో నటించిన రష్మి గౌతమ్ కేవలం గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే మారింది . తన గ్లామర్ తో  అందరికీ చమటలు పట్టించింది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ తో చేయబోతున్న చిత్రంలో మాత్రం మంచి పాత్ర వస్తుందని ఆశిస్తున్నట్లు తేలుస్తుంది . కాగా  శేఖర్ మాస్టర్ రష్మీ కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.మరి  నిజంగానే శేఖర్ మాస్టర్ రష్మీ  కాంబినేషన్ లో సినిమ రాబోతుందా శేఖర్ మాస్టర్ కాస్త హీరో శేఖర్ గా మారబోతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: