పూజా హెగ్డే చాలా తెలివైనది. ఎక్కడ తగ్గడంలేదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆమె ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఇప్పటి హీరోయిన్లకు ఎంతకాలం లైం లైట్ లో కెమెరా ముందు ఉంటామో తెలియదు. వరసగా రెండు ఫ్లాప్స్ వస్తే చాలు ఎవరూ అసలు పట్టించుకోరు. దానికి చాలా మంది టాప్ స్టార్స్ ఉదాహరణ. ఇదిలా ఉండగా పూజా మాత్రం ఆఫర్లను వచ్చిన వాటిని వచ్చినట్లుగా లాగేసుకుంటోంది.

 

హీరో జూనియరా సీనియరా అన్నది కూడా పక్కన పెట్టి  కెమెరా.. స్టార్ట్..  యాక్షన్ అంటోంది. ఇక పూజా హెగ్డే ఈ సంక్రాంతికి  అల వైకుంఠపురంలో అంటూ అల్లు అర్జున్ పక్కన జంటగా వస్తోంది. మరో వైపు ప్రభాస్ తో జాన్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. మరో వైపు మెగా వారసుడు వరుణ్ తేజ్ పక్కన కూడా మెరిసిపోనుంది. ఇక మరిన్ని సినిమాలు స్టార్ హీరోలతోనే కమిట్ అయింది.

 

ఇది చాలదన్నట్లుగా ఇపుడు అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తీస్తున్న కొత్త సినిమాను పూజ ఒకే చేసింది. ఈ మూవీలో పూజ ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుందని టాక్. బొమ్మరిల్లు భాస్కర్ మూవీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఓరెయెంటెడ్ మూవీస్. దాంతో పూజా హెగ్డే సైతం ఈ మూవీలో పరికిణీ ఓణీతో మెరుస్తుందని అంటున్నారు.

 

ఇక ఈ మూవీ అక్కినేని అఖిల్ కి నాలుగవ చిత్రం. ఈ మూవీలోఅ అఖిల్ కూడా ఫ్యామిలీలో ఒక యువకుడిగా కనిపిస్తాడని అంటున్నారు. అఖిల్ ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేసినా సరైన ఫలితం ఇవ్వలేదు. ఇక బొమ్మరిల్లు భాస్కర్  సైతం హిట్ ట్రాక్ నుంచి తప్పుకుని చాలాకాలం అయింది.

 

ఈ ఇద్దరి మధ్యన ఉన్న పూజా మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతోంది. దాంతో పూజా లక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అదే టైంలో మంచి ఫ్యామిలీ స్టోరీతో కసి మీద భాస్కర్ ఈ మూవీని తీయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి అటు అఖిల్, ఇటు భాస్కర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం పూజా మీదనే ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: