చైతూ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వెంకీమామ' సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇక తన తదుపరి సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

 

ఈ సినిమాలో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసలో మాట్లాడటం నేర్చుకుంటున్నాడట. పెర్ఫెక్షన్ కోసం ఆయన గట్టిగానే కష్టపడుతున్నాడని అంటున్నారు. ఆయన సరసన నాయికగా సాయిపల్లవి నటిస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని వేరు వేరు గ్రామాల నుంచి హైదరాబాద్ వచ్చిన యువతీ యువకులుగా వాళ్లు కనిపించనున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

 

అక్కినేని మూడో తరం కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు నాగచైతన్య.. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.. 2009 లో ఈ సినిమా విడుదలైంది. అంటే నాగచైతన్య తన కెరియర్ ని సక్సెఫుల్ గా పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. వెంకీమామ చిత్రంలో నాగ చైతన్య మరింత రా లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణ కుటుంబంలోని కుర్రాడిలా ఇంట్లో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. బీరువాలో ఉన్న డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నట్లు, ఏదో తెలియని గతం కూడా ఉన్నట్లు, దాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లు ఇలా అతనికి సంబంధించిన భావోద్వేగాలన్నింటిని చూపించాడు. మజిలీ చిత్రంలో రా లుక్‌లో కనిపించిన చైతు.. మరోసారి శేఖర్ కమ్ముల చిత్రం కోసం రా లుక్ మెయింటెన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూర్తి భావోద్వేగాలతో కూడిన పాత్రను పోషింస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం కూడా మజిలీలా గుర్తుండిపోయే సినిమా అవుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: