సమంత ఒకప్పుడు మంచి ఆదరణ కలిగిన మరియు ప్రతిభావంతమైన హీరోయిన్ గా మనందరికీ పరిచయం కానీ ఇప్పుడు అక్కినేని కుటుంబ కోడలు. అక్కినేని కుటుంబం లోకి అడుగుపెట్టినాక  రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి సినిమాలలో నటించి పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత సినిమాలను విశ్లేషిస్తే ముందుకి ఎప్పటికి పొంతనే లేదు. ఆమె  నటిగా శిఖరాగ్రానికి వెళ్ళిపొయంది. ఓ బేబీ  సినిమా లో సమంత  ఒక అరవై ఏళ్ల బామ్మా ల మరియు పెళ్లికాని పడుచు అమ్మాయి ల  ఆమె చేసిన నటన అందరిని కట్టిపడేసింది. బామ్మ పాత్రతో తల్లి కొడుకుల ప్రేమానురాగాలను మరోసారి చేపించి ప్రతిఒక్కరిని ఏడిపించింది ఆమె నటనతో.    

అయితే తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక్క ప్రయోగం అనే కంటే ఒకేసారి రెండు ప్రయోగాలు అని  కూడా చెప్పొచ్చు. ఇప్పటివరకు సినిమాలలో కనిపించి కనువిందు చేసిన ఈమె ఇప్పుడు ఒక  ప్రయత్నాంగా  మరియు  తొలి ప్రయోగం గా  తొలిసారిగా ఓ టీవీ షో  వెబ్ సిరీస్  లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

అది కూడా విలక్షణమైన ప్రతినాయికగా  ఉన్న పాత్రను పోషించడం రెండో ప్రయోగం.అసలు విషయాల్లోకి వెళ్తే  సమంత ఓ వెబ్‌సిరీస్‌ ది ఫ్యామిలీ మేన్  అనే వెబ్ సిరీస్  గతంలో ఎంత విజయవంతంగా విజయవంతంగా ప్రదర్శించబడిందో అందరికి తెలిసిన విషయమే. చాలా మంది ప్రేక్షకులు   ఆ కార్యక్రమాన్ని వదిలేవారు కాదు.

అలాంటి మెదటి  ప్రోగ్రాం లో మనోజ్ బాజ్  పేయి మరియి ప్రియమణి నటించి అందరిని మెప్పించారు దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ మొదలైంది.  ఇందులో ఇప్పటి వరకు మంచి పాజిటివ్ పాత్రలే పోషించిన సమంత ఇందులో విలన్ పాత్రను ఎంచుకోవడంకోసం కొసమెరుపు. ది ఫ్యామిలీ మేన్ సిరిస్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, క్రిష్ణ లు  ఈ సిరీస్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: