దిశ అత్యాచారం, హత్య కేసు గురించి చాలామంది దేశంలో ఉన్న జాతీయ పార్టీల నేతలు వివిధ పార్టీల నాయకులు మరియు అదే విధంగా సామాజికవేత్తలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు స్పందించడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని ఆడదాన్ని పవిత్రంగా దేవతగా పూజించే దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయని అసలు రోజురోజుకు సమాజంలో మార్పులు వస్తుంటే ఆడదాని పై అఘాయిత్యాలు అత్యాచారాలు పెరుగుతుంటే కొత్త కొత్త చట్టాలు రావాలి కానీ నిందితులను కాపాడే విధంగా న్యాయస్థానాలు వ్యవహరించడం బాధాకరమని అంతేకాకుండా ఇటువంటి దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని బహిరంగంగా ఎక్కడైతే వారు ఈ ఘటనకు పాల్పడటం జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉరి వేయాలి అందరూ చూస్తుండగానే ఇది జరగాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా దిశ అత్యాచారం, హత్య కేసు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అన్నగా, ఓ తమ్ముడిగా గుండెలు ఎలా కొట్టుకుంటాయో తనకు తెలుసునని పవన్ పేర్కొన్నారు. రూ. 1000, రూ.2000 కోసం మహిళా జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ కు వస్తుంటారని, వారిని కొంతమంది మగవాళ్ళు హింసించిన సంఘటనలు తనకు తెలుసునని, తాను కర్రపట్టుకొని వాళ్ళను తరిమికొట్టిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. దిశ కేసులో అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సంగతితెలిసిందే. 

 

ఉరితీయడం కాదని, వారిని సింగపూర్ తరహాలో తోలు ఊడేలా బెత్తంతో కొట్టాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బెత్తంతో తోలు ఊడేలా కొడితే.. వాళ్లకు బుద్ది వస్తుందని పవన్ పేర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: