ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిన విషయమే. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ... టాప్ రేటింగ్ దూసుకుపోతుంది జబర్దస్త్ షో. అయితే తెలుగు ప్రేక్షకులందరూ జబర్దస్త్ షో కి ఎంత ప్రభావితం అయ్యారు అంటే అప్పటి వరకు ఏ టీవీ చానల్స్ చూస్తున్న  జబర్దస్త్ వస్తుందంటే ఈ టివి పెట్టుకుని టీవీలకు అతుక్కుపోఎంతగా  జబర్దస్త్ తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది. జబర్దస్త్ షో కమెడియన్స్ స్కిట్ లలో  పెల్చె  పంచులకు పగలబడి  మరి నవ్వితు   ఉంటారు తెలుగు ప్రేక్షకులు . అయితే సాదాసీదా షో గా మొదలైన జబర్దస్త్ షో ప్రస్తుతం టెలివిజన్  చరిత్రలోనే టాప్ కామెడీ షో గా...  టాప్ రేటింగ్ దూసుకుపోతుంది జబర్దస్త్ షో.  జబర్దస్త్ షో వచ్చిన తర్వాత ఎన్నో కామెడీ షోలు   వచ్చినప్పటికీ జబర్దస్త్ నవ్వుల సునామి  ముందు నిలువలేక పోయాయి. 

 


 అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు మెగాబ్రదర్ నాగబాబు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే నాగబాబు జబర్దస్త్ లో జడ్జ్ గా  నవ్వుల నాగబాబు గా మారిపోయి జబర్దస్త్ షో కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. జబర్దస్త్ షో కేవలం నాగబాబు నవ్వుల కోసం చూస్తే జబర్దస్త్ ప్రేక్షకులు ఎంతో మంది. ఇక జబర్దస్త్ జడ్జ్ గా ఉండే నాగబాబు లేకుండా ఏదైనా జబర్దస్త్ ఎపిసోడ్ వచ్చిందంటే దానిలో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు బిగ్ షాక్ ఇచ్చారు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జడ్జ్ గా  కొనసాగిన నాగబాబు కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో జబర్దస్త్ ప్రేక్షకులందరూ ఆందోళన చెందారు. జబర్దస్త్ జడ్జ్ గా  నాగబాబును కాకుండా వేరే వారిని ఊహించుకోలేక పోయారు తెలుగు ప్రేక్షకులు. 

 


 ఇదిలా ఉంటే జబర్దస్త్ జడ్జ్ గా  నాగబాబు తప్పుకోవడంతో నాగబాబు ప్లేస్ లో జబర్దస్త్ జడ్జ్ గా  ఎవరు రాబోతున్నారు అనే చర్చ బుల్లితెర ప్రేక్షకుల మొదలైంది అయితే జబర్దస్త్ జడ్జి గా వస్తున్నారు అంటూ కొంతమంది పేర్లు లిస్టు లో ఉన్నాయి. అల్లరి నరేష్, మీనా, కమెడియన్ అలీ,  మా అధ్యక్షుడు నరేష్ ఇలా కొన్ని పేర్లు జబర్దస్త్ జడ్జ్ గా  రాబోతున్నారు అంటూ లిస్ట్  లో ఉన్నాయి.  అయితే ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా అలీ  ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. చివరికి నాగబాబు ప్లేస్లో అలీని  జబర్దస్త్  యాజమాన్యం తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో అలీ  జబర్దస్త్ జడ్జ్ గా  అలరించారు. అయితే జబర్దస్త్ జడ్జ్ గా  వచ్చిన అలీ  ఎప్పటికీ కొనసాగుతారా లేదా కొన్ని ఎపిసోడ్లు వరకు మాత్రమే కొనసాగేందుకు  వచ్చారా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అంతేకాకుండా జబర్దస్త్ నుండి చమ్మక్ చంద్ర తప్పుకుంటున్నారు అంటూ వార్తలు రాగా  చమ్మక్ చంద్ర మరోసారి జబర్దస్త్ లో నే కనిపించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: