సినిమాలు,  సినిమాల నిర్మాణాల ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే జబర్దస్త్ తోనే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మెగా బ్రదర్  నాగబాబు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే నాగబాబు జబర్దస్త్ షో ద్వారా ఆయన లోపల ఎంత సున్నితమైన వ్యక్తి ఉన్నారో  అందరికీ తెలిసేలా చేసారు. జబర్దస్త్ షో తో నవ్వుల నాగబాబు గా మారిపోయారు మెగాబ్రదర్ నాగబాబు. అయితే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జి గా కొనసాగిన మెగా బ్రదర్ నాగబాబు... తన నవ్వులతోనే జబర్దస్త్ షో కి ఎంతో పాపులారిటీ తెచ్చారు అని చెప్పవచ్చు. చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులు నాగబాబు నవ్వుల కోసం కూడా జబర్దస్త్ చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జ్  గా కొనసాగుతున్న నాగబాబు... గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

 


జబర్దస్త్ జడ్జ్ గా  మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడం బుల్లితెరపై పెద్ద సంచలనంగా మారింది. జబర్దస్త్ యాజమాన్యానికి తనకు మద్య  వచ్చిన ఐడియాలజీ సమస్యల వలన జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే జబర్దస్త్ జడ్జ్ గా  తప్పుకున్న  నాగబాబుతో సహా కొంతమంది ఫేమస్ లీడర్లు కూడా నాగబాబుతో వెళ్లిపోయారు అంటూ చర్చ నడిచింది . చమ్మక్ చంద్ర కిరాక్ ఆర్పి లాంటి లీడర్ జబర్దస్త్ జీ తెలుగులో ప్రత్యక్షం కావటం... అటు  నాగబాబు కూడా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోగానే జీ తెలుగులో ప్రత్యక్షం కావటం సంచలనంగా మారింది . అయితే నాగబాబుతో పాటు జబర్దస్త్ ను  వీడుతారా అనుకున్న హైపర్ ఆది సుడిగాలి సుదీర్ మాత్రం జబర్దస్త్ లోనే  కొనసాగుతున్నారు... అంతేకాకుండా ఈ షో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న చమ్మక్ చంద్ర కూడా మళ్ళీ తిరిగి జబర్దస్త్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

 

 ఈ నేపథ్యంలో నాగబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారని టాక్  మళ్ళీ బుల్లితెరపై మొదలైంది. నాగబాబు తో పాటు బయటకి  వస్తారు అనుకున్న కమెడియన్స్  జబర్దస్త్ లోనే కొనసాగుతుండడంతో నాగబాబు కూడా మళ్ళీ జబర్దస్త్ లో కి రీ ఎంట్రీ ఇస్తారా  అన్నది కూడా ప్రస్తుతం బుల్లితెరపై చర్చ జరుగుతుంది. నాగబాబు వేరే ఛానల్లో కొనసాగుతూ జనసేన వ్యవహారాలపై రాజకీయాలపై దృష్టి సారిస్తారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ నుంచి తప్పుకున్న మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి రీ  ఎంట్రీ ఇవ్వబోతున్నారా  అంటూ వస్తున్న వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: