కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడు చూసినా ఒకేళా ఉంటారు.. ఇక ఇప్పటికి బ్యాచిలర్ గా ఉన్న హీరోయిన్స్ ఎవరైనా సరే తమ క్రేజ్ కొనసాగిస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ టబు ఒకరని చెప్పొచ్చు. తెలుగు సినిమాలతో తెరంగేట్రం చేసి ఇక్కడ సత్తా చాటి బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న టబు 45 ఏళ్లు పైబడినా ఇప్పటికి వరుస ఛాన్సులు అందుకుంటుంది.

 

తెలుగులో అడపాదడపా సినిమాలే చేస్తున్న టబు ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. సినిమాలో టబు హీరోయిన్ మదర్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఇదే కాకుండా హిందిలో ఓ స్టార్ హీరో తమ్ముడితో టబు రొమాన్స్ చేస్తుంది. అయితే అది సినిమాలో కాదు వెబ్ సీరీస్ లో అని తెలుస్తుంది.

 

ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సీరీస్ లో 48 ఏళ్ల వయసున్న టబు 24 ఏళ్ల వయసు కలిగిన ఇషాన్ ఖట్టర్ తో రొమాన్స్ చేస్తుంది. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెబ్ సీరీస్ లో మరోసారి టబు రెచ్చిపోయి నటించిందని తెలుస్తుంది. ఏ సూటబుల్ బాయ్ టైటిల్ లోనే మ్యాటర్ ఏంటన్నది అర్ధమవుతుంది. మరి ఈ ముదురు భామతో ఆ యువ హీరో రొమాన్స్ బాలీవుడ్ ఆడియెన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని చెప్పొచ్చు.

 

పోస్టర్ రావడమే ఆలస్యం ఆ వెబ్ సీరీస్ పై రకరకాల వార్తలు వచ్చాయి. వెబ్ సీరీస్ ఎపిసోడ్స్ కోసం ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇషాన్ కట్టర్ బాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. టబు మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తుంది. తెలుగులో తల్లి పాత్రలేస్తూ హిందిలో మాత్రం తన క్రేజ్ కు తగినట్టు పాత్రల్లో నటిస్తుంది అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: